భారత ప్రముఖ హాకీ క్రీడాకారుడు బల్బీర్ సింగ్ జూనియర్(88).. మంగళవారం మరణించారు. నిద్రలోనే తుదిశ్వాస విడిచారని ఆయన కుమార్తె వెల్లడించారు. బల్బీర్ జూనియర్ మృతిపై హాకీ ఇండియా అధ్యక్షుడు, పంజాబ్ గవర్నర్ సహా పలువురు క్రీడాకారులు సంతాపం తెలిపారు.
1932 మే 2న జలంధర్‌లోని సన్సార్పుర్లో పుట్టారు బల్బీర్ సింగ్ జూనియర్. ఆరేళ్ల వయసులోనే హాకీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1951లో తొలిసారి భారత్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నారు. 1958లో ఆసియా గేమ్స్‌లో వెండి గెలిచిన పురుషుల జట్టులో ఇతడు సభ్యుడిగా ఉన్నారు. 1962లో ఆర్మీలో చేరిన ఈయన.. 1984లో మేజర్ హోదాలో రిటైర్ అయ్యారు.