పలు దేశాలను వణికిస్తున్న కరోనా.. మనుషులపైనే కాకుండా వివిధ క్రీడలపైనా ప్రభావం చూపుతోంది. దీని దెబ్బకు ఏప్రిల్లో జరగాల్సిన 'అజ్లాన్ షా హాకీ' టోర్నమెంట్ సెప్టెంబరుకు వాయిదా పడింది.
మలేసియాలో ఏప్రిల్ 11 నుంచి 18 మధ్య ఈ పోటీలు పెట్టాలని అనుకున్నారు. ఇప్పుడు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 3 వరకు జరపనున్నామని నిర్వహకులు సోమవారం ప్రకటించారు.
ఈ వైరస్ వల్ల ఇప్పటికే 3000 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 86 వేల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.