భారత్.. మరోసారి ప్రతిష్టాత్మక ప్రపంచకప్ నిర్వహణ బాధ్యతలు దక్కించుకుంది. 2023 పురుషుల హాకీ ప్రపంచకప్‌నకు అతిథ్యమివ్వనుంది. ఈ హక్కుల కోసం మరో రెండు దేశాలు పోటీపడినా... చివరికి ఆ అదృష్టం భారత్‌నే వరించింది.
2022లో జరిగే మహిళల ప్రపంచకప్‌ను స్పెయిన్, నెదర్లాండ్స్ నిర్వహించనున్నాయి. అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్).. శుక్రవారం వీటికి సంబంధించిన ప్రకటన ఇచ్చింది.
2022 జులై 1-17 తేదీల్లో మహిళల టోర్నీ, 2023 జనవరి 13-29 మధ్యలో పురుషుల మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆతిథ్య దేశాలు.. త్వరలో వేదికలను ప్రకటించనున్నాయి.
-
THIS JUST IN: After #HWC2018's resounding success, India win the hosting rights for the 2023 Hockey Men's World Cup, in 🇮🇳's 75th Independence year!
— Hockey India (@TheHockeyIndia) November 8, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Read more: https://t.co/vemee37J8l#IndiaKaGame pic.twitter.com/ymjgxGwVmy
">THIS JUST IN: After #HWC2018's resounding success, India win the hosting rights for the 2023 Hockey Men's World Cup, in 🇮🇳's 75th Independence year!
— Hockey India (@TheHockeyIndia) November 8, 2019
Read more: https://t.co/vemee37J8l#IndiaKaGame pic.twitter.com/ymjgxGwVmyTHIS JUST IN: After #HWC2018's resounding success, India win the hosting rights for the 2023 Hockey Men's World Cup, in 🇮🇳's 75th Independence year!
— Hockey India (@TheHockeyIndia) November 8, 2019
Read more: https://t.co/vemee37J8l#IndiaKaGame pic.twitter.com/ymjgxGwVmy
ఆతిథ్య దేశాలు... నేరుగా టాప్-5లో చోటు సొంతం చేసుకుంటాయి. అంతేకాకుండా కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్టు ఈ జాబితాలో చేరుతుంది. మిగతా జట్లు.. స్వదేశం, విదేశాల్లో 'ప్లే ఆఫ్ మ్యాచ్'లు ఆడాల్సి ఉంటుంది.
క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల ఫలితాలు, టోక్యో ఒలింపిక్స్ తర్వాత ప్రపంచ ర్యాంకింగ్స్, కాంటినెంటల్ ఛాంపియన్స్‌షిప్ తర్వాత ర్యాంకుల ఆధారంగా జాబితా తయారు చేస్తారు. వాటిలో టాప్-20 జట్లు వరల్డ్‌కప్‌లో పోటీ పడతాయి.
నాలుగోసారి...
భారత్ ఇప్పటికే మూడుసార్లు హాకీ ప్రపంచకప్ నిర్వహించింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు ఈ టోర్నీని నిర్వహించేందుకు భారత్ ముందుకు రాగా... జులై 1-17 (2022) తేదీల్లో నిర్వహించేందుకు బెల్జియం, మలేసియా బిడ్ దాఖలు చేశాయి.
మహిళా హాకీ ప్రపంచకప్ నిర్వహణకు ఐదు దేశాలు ఆసక్తి కనబర్చాయి. జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్ 2022 జులై 1-17 మధ్యలో టోర్నీని జరిపేందుకు ముందుకొచ్చాయి. మలేసియా, న్యూజిలాండ్.. 2023 జనవరి 13-29 మధ్యలో నిర్వహించేందుకు బిడ్ దాఖలు చేశాయి.