జర్మనీకి చెందిన ఫుట్‌బాల్ ప్లేయర్ టోనీ క్రూజ్.. ఓ మ్యాజిక్ గోల్‌తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కార్నర్ నుంచి అద్భుతమైన రీతిలో బంతిని గోల్‌పోస్టులోకి పంపాడు. సౌదీ అరేబియా వేదికగా స్పానిష్ సూపర్ కప్ సెమీఫైనల్లో రియల్ మాడ్రిడ్, వాలెన్సియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ 15వ నిమిషంలో కార్నర్ నుంచి బంతిని ఊహించని రీతిలో గోల్‌గా మలిచాడు రియల్ మాడ్రిడ్ జట్టు ఆటగాడు టోనీ. ప్రత్యర్థి జట్టు గోల్‌కీపర్ జొమే డొమినిచ్ ఆ బంతిని ఆపేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాడు. ఆ షాట్‌ను సాకర్‌లో సరదాగా 'బనానా స్వింగ్'గా పిలుస్తారు. ఈ గోల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
-
😱 No one's safe when @ToniKroos is taking a corner kick pic.twitter.com/PLp476g5EM
— FIFA.com (@FIFAcom) January 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">😱 No one's safe when @ToniKroos is taking a corner kick pic.twitter.com/PLp476g5EM
— FIFA.com (@FIFAcom) January 8, 2020😱 No one's safe when @ToniKroos is taking a corner kick pic.twitter.com/PLp476g5EM
— FIFA.com (@FIFAcom) January 8, 2020
మరో సెమీఫైనల్లో బార్సిలోనా-అట్లెటిక్ మాడ్రిడ్ జట్టు పోటీ పడనున్నాయి. ఈ రెండింటిలో గెలిచిన విజేతతో ఫైనల్లో తలపడనుంది రియల్ మాడ్రిడ్. మానవ హక్కుల అంశంపై ప్రజల్లో నిరసన కారణంగా.. సూపర్ కప్ టోర్నీని స్పెయిన్‌లో కాకుండా సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్నారు.