ETV Bharat / sports

Ronaldo: ప్చ్​ రొనాల్డో.. ఆ ఆశ నెరవేరలేదు!

స్టార్ ఫుట్​బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)కు ఈ సీజన్ ఏ మాత్రం కలిసిరాలేదు. ప్రస్తుతం జరుగుతోన్న యూరో కప్​(Euro Cup)లో ప్రీక్వార్టర్స్​లో బెల్జియం చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది పోర్చుగల్. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్​ టైటిల్ నిలబెట్టుకోలేకపోయింది. అలాగే రొనాల్డో రికార్డుకూ మరికొంత సమయం పట్టేలా ఉంది.

Ronaldo
రొనాల్డో
author img

By

Published : Jun 29, 2021, 11:17 AM IST

స్టార్ ఫుట్‌బాల్‌ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)కు ఈ సీజన్‌ నిరాశజనకంగా సాగుతోంది. 2016లో పోర్చుగల్​ను యూరో కప్‌(Euro Cup)లో విజేతగా నిలిపి.. దేశానికి తొలి ప్రధాన ట్రోఫీని అందించిన అతడు.. ఈ సారి ఆ మాయను కొనసాగించలేకపోయాడు. ప్రీ క్వార్టర్స్‌లోనే బెల్జియం చేతిలో పోర్చుగల్‌ ఓటమితో తీవ్ర నిరాశ చెందిన 36 ఏళ్ల రొనాల్డో బాధతో మైదానం వీడాడు.

ఆరంభం అదిరినా..

అయితే.. ఈ సారి యూరో కప్‌ను రొనాల్డో గొప్పగానే ఆరంభించాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లోనే అయిదు గోల్స్‌ చేసి.. ఆల్‌టైమ్‌ అంతర్జాతీయ గోల్స్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఇరాన్‌ మాజీ ఆటగాడు అలీ దేయ్‌ను సమం చేశాడు. బెల్జియంతో మ్యాచ్‌లో అతనొక్క గోల్‌ చేసినా.. సరికొత్త చరిత్ర సృష్టించేవాడు. అలాగే జట్టునూ కాపాడేవాడు.

Ronaldo
రొనాల్డో

మాయ చేయలేదు..

ప్రతి మ్యాచ్​లోనూ తనదైన మాయ చేస్తూ బంతిని గోల్ పోస్ట్​లోకి పంపడం రొనాల్గో ప్రత్యేకత. కానీ ఈ మాయ ఈ పోరులో కరవైంది. గోల్‌ చేసే అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేదు. మెరుపు వేగంతో పరుగెత్తి ప్రత్యర్థులను వెనక్కినెట్టే అతను.. ఆ జోరు ప్రదర్శించలేకపోయాడు. ఫ్రీ కిక్‌లనూ ఉపయోగించుకోలేకపోయాడు. దీంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా యూరో కప్‌లో అడుగుపెట్టిన పోర్చుగల్.. టైటిల్‌ నిలబెట్టుకోలేకపోయింది. అలాగే.. అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌లో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు అతను ఇంకొంత కాలం ఎదురు చూడాల్సి వచ్చింది.

అందులోనే నిరాశే..

Ronaldo
రొనాల్డో

ఈ ఏడాది ఉత్తమ ఫుట్‌బాల్‌ ఆటగాడి అవార్డూ రొనాల్డో దక్కేలా లేదు. తన క్లబ్బు జువెంటిస్, తన జట్టు పోర్చుగల్‌ తరపున అతను ఈ సీజన్‌లో మొత్తం 40కి పైగా గోల్స్‌ చేసినప్పటికీ.. రొనాల్డో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. జువెంటిస్‌కు ఇటాలియన్‌ లీగ్‌ (సిరీ- ఎ) టైటిల్‌ అందించకపోవడం వల్ల వచ్చే ఏడాది ఆ క్లబ్బుతో ముగిసే అతని ఒప్పందాన్ని పొడిగిస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఈ ఏడాది అతను.. ఇటాలియన్‌ కప్, ఇటాలియన్‌ సూపర్‌ కప్‌ టైటిళ్లు మాత్రమే గెలిచాడు.

ఇవీ చూడండి: రొనాల్డో ప్రేయసి రోడ్రిగ్స్​ మైమరిపించే అందాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.