ETV Bharat / sports

బెంజిమా డబుల్.. లా లిగా విజేతగా రియల్ మాడ్రిడ్ - 34వ సారి లా లిగా విజేతగా రియల్ మాడ్రిడ్

ప్రముఖ ఫుట్​బాల్ లీగ్ లా లిగా టైటిల్ విజేతగా నిలిచింది రియల్ మాడ్రిడ్. ఫైనల్లో విల్లేరియల్​పై గెలిచి 34వ సారి టైటిల్ కైవసం చేసుకుంది.

బెంజిమా డబుల్.. 34వ సారి లా లిగా విజేతగా రియల్ మాడ్రిడ్

author img

By

Published : Jul 17, 2020, 5:17 PM IST

ప్రముఖ ఫుట్​బాల్ లీగ్ లా లిగా టైటిల్ విజేతగా నిలిచింది రియల్ మాడ్రిడ్. సొంత మైదానంలో విల్లేరియల్​పై జరిగిన ఫైనల్లో 2-1తేడాతో గెలుపొందింది. ఇంకొక మ్యాచ్​ మిగిలుండగానే టైటిల్ కైవసం చేసుకుంది. రియల్ మాడ్రిడ్​కు ఇది 34వ లా లిగా టైటిల్. బార్సిలోనా 26 టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉంది.

34వ సారి లా లిగా విజేతగా రియల్ మాడ్రిడ్
34వ సారి లా లిగా విజేతగా రియల్ మాడ్రిడ్

వెటరన్ స్ట్రైకర్ కరీమ్ బెంజిమా ఫస్ట్​ హాఫ్​లో గోల్​తో మాడ్రిడ్​ను ఆధిక్యంలో నిలిపాడు. తర్వాత పెనాల్టీ షూట్​తో ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. విల్లేరియల్ ఆటగాడు మార్కో అసెన్సియో గోల్​ చేసినా ఫలితం లేకపోయింది. ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన రియల్ మాడ్రిడ్ పాయింట్ల పట్టికలో బార్సిలోనా కంటే ఏడు పాయింట్లు ముందంజలో ఉండి టైటిల్ కైవసం చేసుకుంది.

34వ సారి లా లిగా విజేతగా రియల్ మాడ్రిడ్
34వ సారి లా లిగా విజేతగా రియల్ మాడ్రిడ్

సొంతమైదానంలో ఒసాసునా జట్టుపై ఓటమి పాలవడం వల్ల బార్సిలోనా టైటిల్ ఆశలు ఆవిరయ్యాయి. ఈ మ్యాచ్​లో ఒసాసునా ఆటగాడు జోస్ అర్నేజ్​ గోల్​ చేయగా సెకండ్ హాఫ్​లో మెస్సీ గోల్​తో స్కోర్​ను సమం చేశాడు. కానీ చివర్లో రాబర్టో టోరెస్ చేసిన గోల్​ వల్ల బార్సిలోనా 2-1 తేడాతో ఓటమిపాలైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.