ETV Bharat / sports

ఈ ఫుట్​బాలర్​.. రొనాల్డో, మెస్సి కన్నా ధనికుడు - Messi Income

ప్రపంచవ్యాప్తంగా ఫుట్​బాల్​కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. హాలీవుడ్​ స్టార్​ హీరోల కన్నా.. ఫుట్​బాల్ ఆటగాళ్లకే క్రేజ్​ ఎక్కువ. అంతటి పాపులర్​​ ఆటలో అత్యంత ధనిక ఫుట్​బాలర్(Richest Footballer in the world) ఎవరో తెలుసుకుందాం.

faiq bolkiah
ఫైక్ బుకయ్య
author img

By

Published : Nov 23, 2021, 12:30 PM IST

ఫుట్​బాల్​ అనగానే వెంటనే గుర్తొచ్చే ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో(Ronaldo Income), మెస్సి(Messi News). ఈ ఆటగాళ్లకున్న ఫ్యాన్స్​ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మైదానంలో తమ ఆటతీరుతో కోట్లు సంపాదిస్తుంటారు. అయితే.. ప్రపంచంలో అత్యంత ధనిక ఫుటబాలర్(Richest Footballer in the world)​ మాత్రం వీరిద్దరూ కాదంటే నమ్మశక్యంగా అనిపించదు. మరి వీరిని మించిన ధనిక ఆటగాడు ఎవరో తెలుసుకుందాం..

బ్రూనై జట్టు ఆటగాడే..

ఛెల్సియా లైసెస్టర్ సిటీ అకాడమీ మాజీ ఆటగాడు ఫైక్ బుకయ్య(23) ప్రపంచ ఫుట్​బాల్ ఆటగాళ్లందరిలోనూ ధనవంతుడు. బ్రూనై అంతర్జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతడు స్వయానా బ్రూనై సుల్తాన్​ హస్సానల్ బుకయ్య మేనల్లుడు.

ఫైక్ ఆదాయం దాదాపు 17.5 బిలియన్ డాలర్లు. అయినప్పటికీ ఫుట్​బాల్​ ఆటగాడిగా పేరు తెచ్చుకునేందుకే ఇష్టపడ్డాడు. అమెరికా లాస్​ ఏంజెల్స్​లో జన్మించిన ఫైక్.. ఇంగ్లాండ్ బెర్క్​షైర్​లో విద్యను పూర్తిచేసుకున్నాడు. 2009లో ఫుట్​బాల్ అడేందుకు సౌతాంప్టన్ యూత్​ అకాడమీలో చేరాడు. అనంతరం తన ఫుట్​బాల్ ప్రస్థానాన్ని కొనసాగించాడు. అయితే.. ఫైక్​ తన ధనబలాన్ని ఎక్కడ ఉపయోగించేవాడుకాదని, ధనికుడన్న విషయం తెలియనీయకుండా.. ఇతర ఆటగాళ్లతో సులభంగా కలిసిపోయేవాడని స్టామ్​ఫోర్డ్ బ్రిడ్జ్ టీమ్​ ఆటగాడు రుబెన్ సమాట్ తెలిపాడు.

ఫైక్​ ప్రస్తుతం పోర్టుగీసుకు చెందిన మారిటిమో జట్టులో ఆడుతున్నాడు.

ఇదీ చదవండి:

అగ్రస్థానంలో రొనాల్డో- గిన్నిస్ సొంతం

ఆ రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా రొనాల్డో

T20 World Cup 2021: రొనాల్డోలా వార్నర్​.. నవ్వులు పూయిస్తూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.