ETV Bharat / sports

బార్సిలోనాతో మెస్సీ ఒప్పందం విలువ ఎంతో తెలుసా?

నాలుగేళ్ల క్రితం లియోనాల్​ మెస్సీకి, బార్సిలోనా జట్టుకు మధ్య కుదిరిన ఒప్పందం విలువ ఎంతో తెలుసా? అక్షరాల 4వేల 9 వందల కోట్ల రూపాయలు. సదరు విషయాలను స్పెయిన్​కు చెందిన ఓ వార్త సంస్థ బయటపెట్టింది.

Messi's contract worth up to 555 million euros
మెస్సీ ఒప్పందం విలువ రూ.49వందల కోట్లు!
author img

By

Published : Jan 31, 2021, 12:11 PM IST

దిగ్గజ ఫుట్​బాల్​ ఆటగాడు లియోనాల్ మెస్సీ.. బార్సిలోనా ఫ్రాంచైజీతో చేసుకున్న ఒప్పందం విలువ ఎంతో తెలుసా? నాలుగు సీజన్లకు కలిపి రూ.4900 కోట్లు. ఓ క్రీడాకారుడు పొందిన అతిపెద్ద మొత్తం ఇదే. ఇందుకు సంబంధించిన విషయాలను తాజాగా స్పెయిన్​కు చెందని ఎల్​ ముండో అనే వార్త సంస్థ బయటపెట్టింది.

2017లో ప్రతి సీజన్​కు రూ.12.21వందల కోట్లు చెల్లించడానికి బార్సిలోనాకు చెందిన కాటలన్ క్లబ్​ అంగీకరించింది. ఈ కాంట్రాక్ట్​ గడువు ఈ ఏడాది జూన్​తో ముగియనుంది. తాజాగా మళ్లీ ఒప్పందం కుదుర్చుకోలేదు. సదరు మొత్తం నుంచి సగం డబ్బులు.. పన్నుల రూపంలో స్పెయిన్​ ప్రభుత్వానికి.. మెస్సీ చెల్లించాడు.

గతేడాది క్లబ్​తో వచ్చిన వివాదాల కారణంగా మెస్సీ జట్టును వీడాలనుకున్నాడు. దీంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఇంకా ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ.. మెస్సీకి ఇప్పటికే రూ.45వందల కోట్లకు పైగానే ముట్టినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఆసుపత్రి నుంచి గంగూలీ డిశ్చార్జి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.