ETV Bharat / sports

కరోనాతో మ్యాచ్​లు రద్దయినా జీతాలు చెల్లిస్తారా? - Manchester United news 2020

కరోనా వైరస్​ దెబ్బకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఫుట్​బాల్​ టోర్నీలన్నీ బంద్​ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయం రాకపోయినా జీతాలిస్తామని ప్రకటించింది మాంచెస్టర్​ యునైటెడ్​ క్లబ్​.

Manchester United
కరోనాతో మ్యాచ్​లు రద్దయినా జీతాలు ఇస్తాం
author img

By

Published : Mar 20, 2020, 6:19 PM IST

Updated : Mar 20, 2020, 7:14 PM IST

ఇంగ్లాండ్​కు చెందిన ప్రముఖ ఫుట్​బాల్​ క్లబ్​ మాంచెస్టర్​ యునైటెడ్​... సాధారణ కార్మికులు, సిబ్బందికి యధావిధిగా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫుట్​బాల్​ టోర్నీలు రద్దవగా, మరికొన్ని వాయిదా పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా ఫ్రాంచైజీలు, క్లబ్​ యజమాన్యాలు భారీ నష్టాలు ఎదుర్కొనున్నాయి. అయితే గత మూడు నెలలుగా సేవలందిస్తున్న చిన్నస్థాయి వర్కర్లకు జీతాలు ఇస్తామని తాజాగా ప్రకటించింది మాంచెస్టర్​ యునైటెడ్​ క్లబ్​.

Manchester United
మాంచెస్టర్​ యునైటెడ్

" మాంచెస్టర్​ యునైటెడ్​ గతంలో ప్రకటించిన షెడ్యూల్​ ప్రకారం అన్ని మ్యాచ్​లు జరగకపోయినా సాధారణ కార్మికులు, సిబ్బందికి కచ్చితంగా జీతాలు అందిస్తాం. ప్రీమియర్​ లీగ్ మ్యాచ్​లు​ పూర్తిగా రద్దయినా ,ప్రేక్షకులు లేకుండా నిర్వహించినా మా నిర్ణయంలో మార్పు ఉండదు"

-- మాంచెస్టర్​ యునైటెడ్, ఫుట్​బాల్​ క్లబ్​

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది ఆ క్లబ్​ యాజమాన్యం. త్వరలోనే అభిమానులు మళ్లీ తమ సొంత స్టేడియం ఓల్డ్​ ట్రాఫోర్డ్​లో మ్యాచ్​లు చూస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. కొవిడ్​-19 వ్యాప్తి నేపథ్యంలో ఫుట్​బాల్​ ప్రీమియర్​ లీగ్​ మ్యాచ్​లన్నీ ఏప్రిల్​ 30 వరకు రద్దయ్యాయి.

Last Updated : Mar 20, 2020, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.