ETV Bharat / sports

ఆ క్లబ్​తో కొత్త ఒప్పందానికి మెస్సీ గ్రీన్ సిగ్నల్! - లియోనాల్ మెస్సీ వార్తలు

దిగ్గజ ఫుట్​బాలర్​ మెస్సీ.. మరో క్లబ్​తో కొత్త కాంట్రాక్ట్​కు సిద్ధమయ్యాడట. పారిస్​ సెయింట్​ జర్మైన్​ క్లబ్​తో(పీఎస్​జీ)​ ఒప్పందం కూడా చేసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు కొనసాగనుంది.

Lionel Messi
లియోనాల్ మెస్సీ
author img

By

Published : Aug 10, 2021, 6:21 PM IST

ప్రముఖ ఫుట్‌బాలర్ లియోనల్‌ మెస్సీ కొత్త ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌కు ఇటీవల వీడ్కోలు పలికిన ఆయన.. పారిస్​ సెయింట్​ జర్మైన్​ క్లబ్​(పీఎస్​జీ)​ కొత్త కాంట్రాక్ట్​కు అంగీకారం తెలిపాడట. ఈ ఒప్పందం రెండేళ్ల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగించుకునే అవకాశం కూడా పీఎస్​జీ కల్పించినట్లు సమాచారం.

మెస్సీ కన్నీటి పర్యంతం..

సుదీర్ఘకాలం పాటు బార్సిలోనా ఫుట్‌బాల్‌ క్లబ్‌తో కొనసాగిన మెస్సీ.. వీడే క్రమంలో కన్నీటి పర్యంతమయ్యాడు. మెస్సీకి వీడ్కోలు పలికేందుకు ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తాను కంటతడి పెట్టడమే కాకుండా చూస్తున్న వారినీ కన్నీళ్లు పెట్టించాడు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజుగా దీనిని అభివర్ణించాడు.

మెస్సీ.. స్పానిష్​ క్లబ్​ బార్సిలోనాతో మరో ఐదేళ్లపాటు కాంట్రాక్ట్​ కుదుర్చుకోనున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. స్పానిష్ లీగ్​లోని​ ఆర్థిక నిబంధనల వల్ల మెస్సీతో కాంట్రాక్టు కొనసాగించలేకపోతున్నామని ఇటీవల బార్సిలోనా ఎఫ్​సీ వెల్లడించింది.

ఇవీ చదవండి:

బార్సిలోనాతో ముగిసిన మెస్సీ బంధం

Lionel Messi: సాకర్​ స్టార్​​ 'మెస్సీ' భావోద్వేగం.. కారణమిదే

బార్సిలోనాతోనే మెస్సీ.. వేతనంలో కోతకూ సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.