ETV Bharat / sports

ఫిఫా ర్యాంకింగ్స్​లో భారత్‌ 23వ స్థానం - ఫిఫా ఈ- దేశాల సిరీస్‌ 2022

ఫిఫా ఈ- దేశాల సిరీస్‌ 2022 (FIFAe Nations Series) టోర్నీలో భారత్‌ తలపడనుంది. ఈ గేమింగ్‌ టోర్నీని ఫిఫా నిర్వహిస్తోంది. టోర్నీ ఆన్‌లైన్‌ క్వాలిఫయర్స్‌ ఈ డిసెంబర్‌లో ఆరంభం కానున్నాయి.

FIFAe Nations Series
ఫిఫా
author img

By

Published : Oct 29, 2021, 7:05 AM IST

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో భారత్‌ 23వ స్థానంలో ఉంది. అదేంటి ప్రపంచ ఉత్తమ జట్లను దాటి మన దేశం ఎప్పుడా స్థానానికి ఎగబాకిందని అనుకుంటున్నారా?.. ఈ ర్యాంకింగ్‌ ఫిఫా ఈ- దేశాల జాబితాలోనిది. అంటే అంతర్జాలంలో ఆడే ఫిఫా ఆటలోనిది. మొత్తం 60 దేశాల జాబితాలో భారత్‌ 23వ ర్యాంకులో ఉంది. ఫిఫా ఈ- దేశాల సిరీస్‌ 2022 (FIFAe Nations Series) టోర్నీలో భారత్‌ తలపడనుంది. ఈ గేమింగ్‌ టోర్నీని ఫిఫా నిర్వహిస్తోంది. ఆసియా, ఓషియానియా నుంచి భారత్‌ ఈ టోర్నీలో పోటీపడుతుంది. గత సీజన్‌లో తృటిలో మన జట్టు ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం కోల్పోయింది. ఈ సారి మాత్రం అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది.

ఈ టోర్నీ (FIFA Nations Series) ఆన్‌లైన్‌ క్వాలిఫయర్స్‌ ఈ డిసెంబర్‌లో ఆరంభమవుతాయి. ఏప్రిల్‌ వరకూ సాగే ఈ అర్హత రౌండ్లో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు ప్లేఆఫ్స్‌ చేరుతుంది. ప్లేఆఫ్స్‌ వచ్చే ఏడాది జూన్‌లో జరుగుతాయి. ఫిఫా ఈ- నేషన్స్‌ కప్‌ జులైలో నిర్వహించే అవకాశం ఉంది. ప్లేఆఫ్స్‌ నుంచి అర్హత సాధించిన 23 జట్లతో పాటు ఆతిథ్య దేశం ఈ నేషన్స్‌ కప్‌లో పోటీపడతాయి. ఈ టోర్నీలో పాల్గొనే జట్టును ఎంపిక చేయడం కోసం.. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఈ- ఫుట్‌బాల్‌ ఛాలెంజర్‌ పోటీలను నిర్వహిస్తుంది. ఈ టోర్నీలో సత్తాచాటిన గేమర్‌ అథ్లెట్లు జాతీయ జట్టు తరపున ఫిఫా ఈ- దేశాల సిరీస్‌లో పాల్గొంటారు.

ఇదీ చూడండి: SAFF 2021: ఎనిమిదోసారి శాఫ్ ఛాంపియన్​గా భారత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.