ETV Bharat / sports

Coca cola: రొనాల్డో వద్దన్నాడు.. లియోనార్డో తాగాడు! - Euro cup final updates

ప్రముఖ ఫుట్​బాల్ ప్లేయర్​ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఓ ప్రెస్​మీట్​లో కోకా కోలా డ్రింక్​ను తాగడానికి వ్యతిరేకించగా.. ఇప్పుడు అందుకు భిన్నంగా మరో ఫుట్​బాల్ ఆటగాడు లియోనార్డో బోనుచి ఆ శీతల పానీయాన్ని ఎంతో ఇష్టంగా తాగాడు. అప్పుడేమో రొనాల్డో 'నీరు మాత్రమే తాగండి' అని సూచించగా.. బోనుచి 'నేను అన్నీ తాగుతా' అంటూ మాట్లాడాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోల్ని నెటిజన్లు ట్రోల్​ చేస్తున్నారు.

Leonardo Bonucci
రొనాల్డో , లియానార్డో
author img

By

Published : Jul 12, 2021, 3:50 PM IST

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్​బాల్ ప్లేయర్​ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) యూరో కప్ ప్రెస్ మీట్​లో కోకా కోలా(Coca Cola) బాటిల్​ను పక్కనపెట్టిన వీడియో వైరల్​ అవ్వడం ఎవ్వరూ మర్చిపోయి ఉండరు. 'కార్బైడ్ డ్రింక్స్​కు దూరంగా ఉండండి.. నీరు తాగండి' అంటూ అతడు సూచించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో సదరు కంపెనీకి దాదాపు రూ.30 వేల కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా!.

అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా మరో ప్రముఖ ఫుట్​బాల్ ప్లేయర్​ లియోనార్డో బోనుచి యూరో కప్ ఫైనల్ అనంతరం ప్రెస్​మీట్​లో కోకా కోలా డ్రింక్​ను ఎంతో ఇష్టంగా తాగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు 'రొనాల్డో అలా.. లియోనార్డో ఇలా' అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ వీడియోలను ట్రోల్​ చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఫైనల్​లో ఇటలీ 3-2 తేడాతో ఇంగ్లాండ్‌పై గెలిచింది. దీంతో యూరో కప్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్​లో ఇటలీ ఆటగాడు లియోనార్డో బోనుచి ఓ కీలక గోల్‌ చేసి మ్యాచ్​ విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ప్రెస్​మీట్​లో పాల్గొన్న అతడు ఆనందంతో కోకా కోలా, బీర్​ తాగాడు. 'ఈ రాత్రికి అన్ని తాగుతా' అంటూ కామెంట్​ చేశాడు.

ఇదీ చూడండి: రొనాల్డో దెబ్బకు కోకాకోలా కంపెనీకి 30వేల కోట్ల నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.