ETV Bharat / sports

పీలే రికార్డును అధిగమించిన రొనాల్డో - పీలే రొనాల్డో

స్టార్​ ఫుట్​బాల్​ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో సాకర్​ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సెరీ ఏ లీగ్​లో కాగ్లియారీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్​లో జువెంటస్​ ఫుట్​బాలర్​ రొనాల్డో.. హ్యాట్రిక్​ గోల్స్​తో తన జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఈ గోల్స్​తో ఫుట్​బాల్​ చరిత్రలో అత్యధిక గోల్స్​ చేసిన పీలే రికార్డును అధిగమించాడు.

I admire you a lot: Pele pens down emotional note for Ronaldo as CR7 breaks his record
పీలే రికార్డును అధిగమించిన రొనాల్డో
author img

By

Published : Mar 15, 2021, 3:39 PM IST

పోర్చుగల్​ ఎఫ్​సీ స్టార్​ ఫుట్​బాలర్​ క్రిస్టియానో రొనాల్టో.. సాకర్​లో మరో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఫుట్​బాల్​ చరిత్రలో అత్య‌ధిక గోల్స్ చేసిన ఆటగాడిగా బ్రెజిల్ దిగ్గజం పీలే నెలకొల్పిన రికార్డును తిర‌గ‌రాశాడు. ఆదివారం జువెంట‌స్ క్ల‌బ్ త‌ర‌ఫున హ్యాట్రిక్(3) గోల్స్ చేసిన రొనాల్డో.. ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు.

ఈ గోల్స్​తో రొనాల్డో తన కెరీర్​లో చేసిన గోల్స్​ 770కి చేరాయి. సెరీ ఏ లీగ్​లో భాగంగా కాగ్లియారీ ఫుట్​బాల్​ జట్టుతో జరిగిన గేమ్​లో రొనాల్డో ప్రాతినిధ్యం వహంచిన జువెంటస్​ 3-1తో గెలుపొందింది.

హ్యాట్రిక్‌ గోల్స్​తో రికార్డు

ఫుట్​బాల్​ చరిత్రలో 767 గోల్స్​తో అత్యధిక గోల్స్​ చేసిన ఆటగాడిగా పీలే గతంలోనే రికార్డు సాధించాడు. ఈ కాగ్లియారీ టీమ్​తో మ్యాచ్​కు ముందు పీలే రికార్డును సమం చేసిన రొనాల్డో.. ఈ మ్యాచ్​లో హ్యాట్రిక్​ గోల్స్​తో పీలే రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా సాకర్​లో అత్యధిక గోల్స్(770)​ చేసిన ఆటగాడిగా సరికొత్త ఘనతను తన పేరుపై లిఖించుకున్నాడు.

పోర్చుగల్​ ఎఫ్​సీతో పాటు వివిధ ఫుట్​బాల్​ క్లబ్​ల తరఫున ఆడిన రొనాల్డో.. పోర్చుగల్​ తరఫున 102, మాంచెస్టర్​ యునైటెడ్​ తరఫున 118, జువెంటస్​ తరఫున 95, రియల్​ మాడ్రిడ్​ తరఫున 450, స్పోర్టింగ్​ లిస్బన్​ తరఫున 5 గోల్స్​ చేశాడు.

ఇదీ చూడండి: పీలే రికార్డు తిరగరాసిన మెస్సీ.. ఏమన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.