ఫుట్‌బాల్.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకున్న క్రేజే వేరు. ఒక్క గోల్ కొట్టాలంటే ఇరు జట్ల ఆటగాళ్లు చెమటలు చిందిల్సాందే. ఈ కోర్టు నుంచి బంతిని అవతలి కోర్టులోని గోల్‌పోస్ట్‌కు సమీపంగా గోల్ కొట్టడం మాములు విషయం కాదు. అలాంటిది 68 గజాల దూరం నుంచి బంతిని ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి పంపాడు ఇంగ్లాండ్ ప్లేయర్ వేస్ రూనీ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
లాస్ ఏంజెల్స్ వేదికగా మేజర్ సాకర్లీగ్లో ఓర్లాండోతో జరిగిన మ్యాచ్‌లో డీసీ యునైటెడ్ ఆటగాడు వేస్ రూనీ ఈ ఘనత సాధించాడు. తన కోర్టులో నుంచి ప్రత్యర్థి కోర్టులోని గోల్ పోస్ట్‌లో గోల్ కొట్టాడు. ఆటగాళ్లంతా డీసీ జట్టు కోర్టులో ఉండడం గమనించిన రూనీ తెలివిగా గోల్ చేశాడు. ఆ సమయంలో ప్రత్యర్థి గోల్ కీపర్ బ్రియన్ రోవె సైతం గోల్‌పోస్ట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ గోల్‌కు మంత్రముగ్ధులైన అభిమానులు కేరింతలు కొట్టారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు వేస్ రూనీ. అనంతరం దానికి వీడ్కోలు పలికి క్లబ్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ప్రస్తుతం మేజర్ సాకర్ లీగ్‌లో డీసీ యునైటెడ్ తరఫున ఆడుతున్నాడు.
ఇది చదవండి: ఎదురులేని టీమిండియా.. విండీస్‌పై అలవోక విజయం