ETV Bharat / sports

FIFA Worldcup: భారత్​ విజయం.. ఛెత్రి అదరహో - సునీల్‌ ఛెత్రి

ఫిఫా ప్రపంచకప్​ క్వాలిఫయర్స్​లో(Fifa Worldcup) భారత జట్టు తొలి విజయాన్ని సాధించింది. ​2-0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. 11 అర్హత మ్యాచ్‌ల తర్వాత భారత్‌కు ఈ విజయం దక్కింది. ఈ మ్యాచ్​తో.. ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో అంతర్జాతీయ కెరీర్​లో అత్యధిక గోల్స్​ సాధించిన రెండో ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు కెప్టెన్ సునీల్​ ఛెత్రి.

Sunil Chhetri
ఛెత్రి
author img

By

Published : Jun 8, 2021, 7:05 AM IST

Updated : Jun 8, 2021, 12:35 PM IST

ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో(Fifa Worldcup) భారత్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. సునీల్‌ ఛెత్రి(Sunil Chhetri) రెండు గోల్స్‌ చేయడం వల్ల 2-0తో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. 79వ నిమిషంలో గోల్‌తో ఛెత్రి జట్టు ఖాతా తెరిచాడు.

రెండో అర్ధభాగంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆషిక్‌ కురునియన్‌ ఎడమ నుంచి ఇచ్చిన క్రాస్‌ను ఛెత్రి తలతో నెట్లోకి కొట్టాడు. ఇంజురీ సమయంలో మరో గోల్‌ (90+2)తో ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భారత జట్టుకు ఇదే తొలి విజయం. 11 అర్హత మ్యాచ్‌ల తర్వాత భారత్‌కు విజయం దక్కింది.

మెస్సీని దాటి.. రికార్డు

ఈ మ్యాచ్​తో కలిపి ఛెత్రి ఇప్పటివరకు 74 గోల్స్​ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో అంతర్జాతీయ కెరీర్​లో అత్యధిక గోల్స్​ సాధించిన రెండో ప్లేయర్​గా నిలిచాడు. తనతో సమానంగా ఉన్న అర్జెంటీనా స్టార్​ లియోనెల్​ మెస్సీని(72) అధిగమించాడు. క్రిస్టియానో రొనాల్డో(103) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మూడో స్థానంలో అలీ మబ్​ఖౌత్​(Ali Mabkhout) ఉన్నాడు.

ఇదీ చూడండి: ఛాంపియన్స్‌ లీగ్‌ ఛాంప్‌ చెల్సీ

Last Updated : Jun 8, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.