యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్, ఇటలీలు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడనున్నాయి. వరుసగా రెండోసారి కప్ సాధించాలని ఇటలీ పట్టుమీదుండగా.. ఒక్కసారైనా ఛాంపియన్‌గా నిలవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.
తొలిసారి ఫైనల్లో ఇంగ్లాండ్..
యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్ అదరగొట్టింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెన్మార్క్‌ను ఓడించి తొలిసారి ఫైనల్‌లో తలపడనుంది. 55 ఏళ్ల తర్వాత ఓ మేజర్ టోర్నీలో సెమీస్‌ను దాటి ఫైనల్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే తుదిపోరులో ఇటలీని ఢీకొట్టనుంది. 1966 ప్రపంచకప్ తర్వాత సెమీస్‌లో ఇంగ్లాండ్ గెలవడం ఇదే తొలిసారి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి నుంచి ఇంగ్లాండే ఆధిపత్యం ప్రదర్శించింది. 30వ నిమిషంలో డెన్మార్క్ ఆటగాడు డ్యామ్స్‌గార్డ్ పెనాల్టీ కిక్‌ను అద్భుతంగా గోల్‌చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే డెన్మార్క్ ఆటగాళ్ల తప్పిదంతో ఇంగ్లాండ్ స్కోర్‌ను సమం చేసింది. దీంతో నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్ చేసి సమంగా నిలవడంతో ఆట ఆదనపు సమయానికి దారితీసింది. ఆదనపు సమయంలో ఇంగ్లాండ్ అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుంది. ఆ జట్టు ఆటగాడు హారీ కేన్ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. డెన్మార్క్ పోరాడినా మరో గోల్ చేయలేకపోయింది. దీంతో ఆ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీమ్ 10 సార్లు గోల్ లక్ష్యం దిశగా వెళ్లగా, డెన్మార్క్ కేవలం మూడు సార్లు మాత్రమే వెళ్లింది.
ఇంగ్లాండ్‌తో తలపడనున్న ఇటలీ...
యురోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను రెండోసారి ముద్దాడే దిశగా ఇటలీ మరో అడుగు వేసింది. జోరుమీదున్న ఆ జట్టు నాలుగో సారి యూరో కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పోటాపోటీగా సాగిన సెమీస్‌లో ఆ జట్టు పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 1-1తో నిలిచాయి. మ్యాచ్‌లో ఎక్కువ శాతం స్పెయిన్ ఆధిపత్యం చలాయించింది. కానీ 60వ నిమిషంలో ఫెడరికో గోల్‌తో ఇటలీ ఖాతా తెరిచింది. ఆధిక్యం కాపాడుకునేందుకు ఆ జట్టు తీవ్రంగానే ప్రయత్నించినప్పటికీ స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ మొరాట (80వ ని) గోల్‌తో స్కోరు సమమైంది. ఉత్కంఠభరితంగా సాగిన పెనాల్టీ షూటౌట్‌లో మొదటి ప్రయత్నంలో ఇటలీ, స్పెయిన్ విఫలమయ్యాయి. ఆ తర్వాత ఇటలీ తరఫున బెలోటి, బొనక్కి.. స్పెయిన్ తరఫున మొరెనో, థియాగో బంతిని నెట్‌లోకి పంపడంతో స్కోరు 2-2తో సమమైంది. ఈ దశలో ఇటలీ ఆటగాడు బెర్నార్డెషి గోల్‌తో ఇటలీ 3-2 ఆధిక్యం సాధించింది. నిర్ణీత సమయంలో గోల్‌తో జట్టును ఆదుకున్న మొరాట షూటౌట్లో గోల్ చేయలేకపోవడంతో స్పెయిన్ జట్టులో నిరాశ అలముకుంది. ఆ వెంటనే జోర్గిన్హో బంతిని నెట్‌లోకి పంపడంతో ఇటలీ సంబరాల్లో మునిగిపోయింది. రికార్డు స్థాయిలో గత 33 మ్యాచ్‌ల్లో ఓటమే ఎరుగని ఆ జట్టు.. ఇంగ్లాండ్‌తో తలపడనుంది.
ఇదీ చదవండి:EURO CUP: ఫైనల్లో ఇటలీ.. సెమీస్‌లో స్పెయిన్ చిత్తు