ETV Bharat / sports

EURO CUP: ఫైనల్లో ఇటలీ.. సెమీస్​లో స్పెయిన్ చిత్తు - కోపా అమెరికా కప్

యూరో కప్​ తొలి సెమీస్​లో ఇటలీ.. స్పెయిన్​పై 4-2 తేడాతో గెలుపొందింది. పెనాల్టీ షూటౌట్​కు దారితీసిన ఈ మ్యాచ్​లో ఇటలీ 4 గోల్స్​ చేయగా, స్పెయిన్​ రెండు చేసింది. పెనాల్టీ కిక్​ను గోల్​గా మలిచిన జోర్గిన్హో ఇటలీని విజేతగా నిలిపాడు.

euro cup, italy in final
యూరో కప్, ఫైనల్​కు ఇటలీ
author img

By

Published : Jul 7, 2021, 7:07 AM IST

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన యూరో కప్‌ తొలి సెమీస్‌లో ఇటలీ గెలిచింది. పెనాల్టీ షూటౌట్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో 4-2 తేడాతో ఇటలీ జట్టు స్పెయిన్‌ను ఓడించింది. దీంతో ఇటలీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తంగా స్పెయిన్‌ జట్టే ఆధిపత్యాన్ని ప్రదర్శించినప్పటికీ అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోయింది. 60వ నిమిషంలో ఫెడెరికో చియెసా గోల్‌ కొట్టి ఇటలీని ఆధిక్యంలో తీసుకెళ్లాడు. స్పెయిన్‌ ఆటగాడు అల్‌వరో మొరాటా 80వ నిమిషంలో గోల్‌ చేసి స్కోర్‌ను సమం చేశాడు. అయితే నిర్ణీత సమయానికి ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచాయి.

అదనపు సమయంలో కూడా రెండు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది. ఇక పెనాల్టీ సమరంలో చెరి ఆరు అవకాశాల్లో ఇటలీ నాలుగు చేయగా, స్పెయిన్‌ రెండు చేసింది. స్కోర్‌ 3-2తో ఉన్న సమయంలో ఇటలీ ఆటగాడు జోర్గిన్హో నిర్ణయాత్మక పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచాడు. దీంతో ఇటలీ ఘన విజయం సాధించింది.

కోపా కప్​లో బ్రెజిల్​..

కోపా అమెరికా కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బ్రెజిల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఆ జట్టు 1-0తో పెరూను ఓడించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి బంతిని నియంత్రణలో ఉంచుకుంటూ బ్రెజిల్‌.. దాడులు కొనసాగించింది. నెయ్‌మార్‌, రిచర్‌లిసన్‌ కొట్టిన షాట్లను పెరూ గోల్‌కీపర్‌ పెడ్రో గాలెజ్‌ మెరుపు డైవ్‌లతో అడ్డుకున్నాడు. అయితే 35వ నిమిషంలో లుకాస్‌ పకెటా గోల్‌ చేసి బ్రెజిల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. గోల్‌పోస్టు సమీపంలో స్టార్‌ స్ట్రైకర్‌ నెయ్‌మార్‌ ఇచ్చిన పాస్‌ను అందుకున్న లుకాస్‌.. బంతిని నెట్‌లోకి కొట్టేశాడు.

brazil, copa america cup
బ్రెజిల్, కోపా అమెరికా కప్

ద్వితీయార్ధంలో పెరూ ఎటాకింగ్‌ గేమ్‌ ఆడినా గోల్స్‌ సాధించడంలో విఫలమైంది. ఆధిక్యాన్ని ఆఖరి వరకు కాపాడుకున్న బ్రెజిల్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. కోపా అమెరికా టోర్నీలో ఫైనల్‌ చేరడం ఆ జట్టుకు ఇది 21వ సారి. బ్రెజిల్‌ ఖాతాలో తొమ్మిది టైటిళ్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: Messi Birthday: టిష్యూ పేపర్​పైనే కాంట్రాక్టు సంతకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.