ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అతడిపై అభిమానాన్ని చూపించేందుకు కొంత మంది సృష్టించిన నకిలీ వార్తలు అతడికి ఇబ్బందికరంగా మారాయి. కరోనాపై పోరాటం చేసేందుకు ఈ స్టార్ ఆటగాడు తన హోటళ్లను ఆసుపత్రులుగా మార్చేందుకు అనుమతి ఇచ్చినట్లు పుకార్లు సృష్టించారు. అయితే మీడియా ఆ హోటల్‌కు వెళ్లి సంప్రదించగా.. అదంతా తప్పుడు సమాచారం అని యాజమాన్యం స్పష్టం చేసింది.
గతంలోనూ భారత్‌లో పలు విపత్తులు, వరదలు సంభవించినప్పుడు.. నిరాశ్రయులైన వారికి స్టార్ నటీనటులు, ప్రముఖులు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించినట్లు వార్తలు వచ్చాయి. కానీ కరోనా విషయంలో ఇలాంటి తప్పుడు సమాచారం సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.
ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 వేల మంది మృతి చెందారు. లక్షా 80 వేల మందికి ఈ వైరస్ సోకింది.
ఇదీ చదవండి...