పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఇటీవలే ఐర్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి ఈ ఘనత సాధించాడు ఈ రికార్డుల రారాజు.
180 మ్యాచ్‌లు ఆడి 111 గోల్స్ చేసి అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో తనదైన ముద్ర వేశాడు రొనాల్డో(Ronaldo goals). ఈ సందర్భంగా గిన్నిస్ రికార్డు చేతపటుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'థాంక్యూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన వాడిలా గుర్తింపు పొందడం ఆనందంగా ఉంది. ఇంకా మరిన్ని రికార్డులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటా' అని కాప్షన్ జోడించాడు రొనాల్డో.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఒక జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన వారిలో అలీ దేయి(109), మోఖ్తర్ దహారి(89), ఫెర్నిస్ పుస్కస్(84), గాడ్ఫ్రే చిటాలు(79) రొనాల్డో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చదవండి:రొనాల్డో ప్రపంచ రికార్డు.. అత్యధిక గోల్స్ వీరుడిగా!