ETV Bharat / sports

రొనాల్డో దెబ్బకు కోకాకోలా కంపెనీకి 30వేల కోట్ల నష్టం

ప్రముఖ ఫుట్​బాల్ ప్లేయర్ క్రిస్టియనో రొనాల్డో చేసిన ఓ చిన్న పని కోకా కోలా కంపెనీకి రూ.30 వేల కోట్ల నష్టం తెప్పించింది. అదేంటి అనుకుంటున్నారా. అయితే పూర్తి కథనం చదివేయండి.

author img

By

Published : Jun 16, 2021, 8:44 AM IST

Updated : Jun 16, 2021, 9:27 AM IST

Ronaldo
రొనాల్డో

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఫుట్​బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ఒక ప్రెస్ మీట్​లో చేసిన ఒక చిన్న పని (GESTURE) కోకా కోలా కంపెనీకి రూ.30 వేల కోట్లు నష్టం తెచ్చిపెట్టింది. యూరో కప్​లో భాగంగా మంగళవారం ప్రెస్​మీట్​కు వచ్చిన రొనాల్డో తన ముందు ఉన్న కోక్ బాటిల్​ను పక్కకునెట్టాడు. అందుకు కారణం లేకపోలేదు.

రొనాల్డో హెల్త్, ఫిట్​నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ నేపథ్యంలో అతడు కార్బోనేటెడ్ డ్రింక్స్​కు చాలా దూరంగా ఉంటాడు. వాటి ప్రకటనల్లోనూ ఇతడు కనిపించడు. అయితే యూరో కప్​(Euro Cup 2021)కు కోకా కోలా(Coca Cola) కంపెనీ స్పాన్సర్​గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రెస్​మీట్​లో ఆ బాటిల్స్ ఉంచారు. అది గమనించిన రొనాల్డో అక్కడి నుంచి బాటిల్​ను తీసేసి.. 'వాటర్ తాగండి' అంటూ అందరికీ చెప్పాడు. అంతే.. ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడం, కోకా కోలా కంపెనీకి భారీ నష్టాలు రావడం చకచకా జరిగిపోయాయి.

యూరో కప్​లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 3-0 తేడాతో హంగేరీపై విజయం సాధించింది. 83 నిమిషాల పాటు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేదు. అయితే 84వ నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు రాఫెల్ గురియో గోల్ చేసి పోర్చుగల్‌కు ఆధిక్యత అందించాడు. ఆ తర్వాత 87వ నిమిషంలో రొనాల్డో పెనాల్టీని గోల్‌గా మలిచాడు. మళ్లీ రొనాల్డోనే ఆఖరి నిమిషంలోమరో గోల్ చేయడం వల్ల పోర్చుగల్ జట్టు 3-0 తేడాతో విజయం సాధించి యూరో కప్‌ను గెలుపుతో ఆరంభించింది.

Last Updated : Jun 16, 2021, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.