ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడు 'పీలే'. మైదానంలో ఆయన నైపుణ్యం గురించి కథలు కథలుగా చెబుతారు. పాత వీడియోలు చూస్తే అతడి ఆటతీరు కళ్లకు కడుతుంది. అయితే ఆటగాడిగా మెరుపు వేగంతో దూసుకెళ్లిన పీలే ఇప్పుడు.. కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడట. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న 79 ఏళ్ల పీలేకు కొన్ని శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా పెద్దగా కోలుకోలేదు. ఆధారం లేకుండా సొంతంగా నడవలేకపోతున్న పీలే.. చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు.
![Brazilian legend Pele depressed, reclusive because of poor health](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6042226_pele2.jpeg)
కొన్నేళ్లుగా ఆయన బయటెక్కడా కనిపించడం లేదు. ఆటగాడిగా ఉన్నపుడు పాదరసంలా కదిలిన తాను.. ఇప్పుడు కనీసం నడవలేని స్థితిలో ఉండటం వల్ల ఆయన సిగ్గుపడి బయటికి రావట్లేదట. ఈ విషయాన్ని పీలే తనయుడు ఎడినో తెలిపాడు.
‘‘ఒకప్పటి ఫుట్‌బాల్ రారాజు.. ఇప్పుడు మామూలుగా నడవలేకపోతే ఎలా అనిపిస్తుందో అర్థం చేసుకోండి. అందుకు ఆయన చాలా సిగ్గు పడుతున్నాడు. కాబట్టే బయటికి రావట్లేదు’’ అని ఎడినో చెప్పాడు.
బ్రెజిల్‌కు చెందిన పీలే.. ఆ దేశానికి మూడు ప్రపంచకప్‌లు అందించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 1958, 1962, 1970 సంవత్సరాల్లో ఆ జట్టు వరల్డ్‌కప్ అందుకోవడంలో ఇతడు కీలకపాత్ర పోషించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">