ETV Bharat / sports

బట్టతలను ఫుట్​బాల్​గా భావించిన ఏఐ కెమెరా - కృత్రిమ మేధ

కరోనా కాలం.. స్టేడియాల్లోకి వెళ్లేందుకు అవకాశం లేదు. అంతా టీవీల్లో మ్యాచ్​లను చూసి ఆనందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఓ ఫుట్​బాల్​ మ్యాచ్​.. క్రీడాభిమానులను తీవ్ర అసహనానికి గురి చేసింది. అత్యాధునిక సాంకేతికతతో ఈ చిక్కు తలెత్తింది! అసలింతకీ ఏం జరిగిందంటే...

a camera has not recorded foot ball match in scotland
ఫుట్​బాల్​గా భావించి..! బంతిని గుర్తించలేకపోయిన కెమెరా
author img

By

Published : Nov 3, 2020, 7:29 AM IST

స్కాట్లాండ్​లోని ఓ ఫుట్​బాల్​ మైదానంలో మ్యాచ్​ జరుగుతోంది. గోల్​ సాధించేందుకు రెండు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడుతున్నారు. కానీ, ఆ దృశ్యాలేవీ చూపించట్లేదు. మ్యాచ్​ సాంతం లైన్​ బయట జెండా పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్న రిఫరీ దృశ్యాలు మాత్రమే కనిపించాయి. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన అభిమానులు.. టీవీల్లో మ్యాచ్​ను చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇలా జరగడానికి ప్రధాన కారణం.. ఆ రిఫరీ బట్టతల అంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ, అదే నిజం.

a camera has not recorded foot ball match in scotland
ఫుట్​బాల్​గా భావించి..! బంతిని గుర్తించలేకపోయిన కెమెరా

ఆ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన కృత్రిమ మేధతో నడిచే అత్యాధునిక కెమెరా అతని బట్టతలను ఫుట్​బాల్​గా భావించడమే దానికి కారణం. కెమెరామెన్​ అవసరం లేకుండా మైదానంలో బంతి కదలికలను బట్టి మ్యాచ్​ను రికార్డు చేయడం కోసం ఈ కెమెరాను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మొదట్లో గొప్పగా చెప్పుకున్నారు. కానీ, ఇటీవల ఐసీటీ, యునైటెడ్​ జట్ల మధ్య మ్యాచ్​లో బంతిని రికార్డు చేస్ ప్రోగ్రామ్​తో రూపొందించిన ఆ కెమెరా.. రిఫరీ బట్టతలను బంతిగా అనుకుని అతని కదలికలను మాత్రమే నిక్షిప్తం చేసింది. దీంతో అభిమానులు నిర్వాహకులపై మండిపడుతున్నారు. వచ్చే మ్యాచ్​లో ఆ రిఫరీ ఓ టోపీ ధరించేలా చూడండంటూ సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుస్తున్నారు.

ఇదీ చూడండి:సన్​రైజర్స్ హైదరాబాద్​ ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.