జింబాబ్వే మాజీ సారథి, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ టేలర్(brendan taylor retirement) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌ను నేడు(సెప్టెంబరు 13) ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో ముగించనున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. తన క్రికెట్ జర్నీలో అండగా ఉన్న కుటుంబం, అభిమానులు, సహ ఆటగాళ్లు.. ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
"ఇదే నా చివరి మ్యాచ్. ఈ 17ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. వినయంగా ఉండటాన్ని క్రికెట్ నేర్పింది. ఈ స్థానంలో ఉండటాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. జట్టును ఉన్నత స్థానంలో నిలబెట్టి వీడ్కోలు పలకాలనుకున్నా. అదే చేశాను అని భావిస్తున్నాను. ఈ ప్రయాణంలో అండగా ఉన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా భార్య, పిల్లలకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు నన్ను ఎంతో అర్థం చేసుకున్నారు. మీరు లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు."
-టేలర్, మాజీ సారథి.
టేలర్ కెరీర్లో 34టెస్టులు(2320 పరుగులు), 202 వన్డేలు(6628), 45టీ20(934) ఆడాడు.
ఇదీ చూడండి: కెప్టెన్సీకి కోహ్లీ గుడ్‌బై.. వన్డే, టీ20 సారథిగా రోహిత్!