ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌తో ప్రాక్టీస్‌ను కూడగట్టుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లు.. నెట్స్‌లోనూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ట్విట్టర్లో షేర్ చేసింది.
ఈ వీడియోలో కెప్టెన్ కోహ్లీ(Virat Kohli)తో పాటు యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్, అజింక్యా రహానె బ్యాటింగ్ చేస్తుండగా.. ఇషాంత్, షమీ బంతులేస్తున్నారు. కోహ్లీ చూడముచ్చటైన కవర్‌డ్రైవ్‌లతో పాటు పుల్ షాట్స్ కొడుతున్న దృశ్యాలు అందులో చూడవచ్చు. యువ బ్యాట్స్‌మన్ రిషభ్ తనదైన శైలిలో నెట్స్‌లో షాట్లు ఆడుతున్నాడు. జడేజా బౌలింగ్‌లో ఓ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. ఇషాంత్ వేసిన ఓ బంతికి మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. వైస్ కెప్టెన్ రహానె.. ఇషాంత్‌తో పాటు షమీ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కనిపించింది.
-
Three sleeps away from the BIG GAME. 👍👍
— BCCI (@BCCI) June 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
How excited are you? 🙌 🙌#WTC21 #TeamIndia pic.twitter.com/nqaI6cf33H
">Three sleeps away from the BIG GAME. 👍👍
— BCCI (@BCCI) June 15, 2021
How excited are you? 🙌 🙌#WTC21 #TeamIndia pic.twitter.com/nqaI6cf33HThree sleeps away from the BIG GAME. 👍👍
— BCCI (@BCCI) June 15, 2021
How excited are you? 🙌 🙌#WTC21 #TeamIndia pic.twitter.com/nqaI6cf33H
ఇదీ చదవండి: IND Vs SL: కోచ్‌గా ద్రవిడ్.. దాదా క్లారిటీ
అంతకుముందు జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జడేజా, గిల్.. అర్థ సెంచరీలతో రాణించారు. ఇషాంత్ 3 వికెట్లు తీసుకున్నాడు.
కేన్ సేనతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ పరిస్థితులు అలవాటు చేసుకోవడానికి కోహ్లీ బృందం ప్రయత్నిస్తోంది. అలాగే ఈ మ్యాచ్ కోసం కివీస్ తమ స్క్వాడ్‌ను ప్రకటించింది. గాయంతో ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ విలియమ్సన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
ఇదీ చదవండి: 'లాలాజలం లేకుండా బంతితో స్వింగ్ రాబట్టొచ్చు!'