నేటి తరం మేటి పేసర్లలలో టీమ్ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒకడు. డెత్ ఓవర్లలో సమర్థంగా బౌలింగ్ చేయగలడన్న పేరు గడించిన బుమ్రా.. అతడి బౌలింగ్ శైలితోనూ అభిమానులకు దగ్గరయ్యాడు. అనతికాలంలోనే భారత బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించే సత్తా సంపాదించాడు. 145 కి.మీ.లకు తగ్గకుండా బంతిని విసురుతూ బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసురుతాడు. అయితే ఇటీవలి కాలంలో మరో కొత్త టెక్నిక్‌ను తన అమ్ములపొదిలో చేర్చుకున్నాడు బుమ్రా. అదేంటో మీరూ తెలుసుకోండి.
ఇక బుమ్రా బౌలింగ్‌లో పరుగులు తీయాలంటేనే ఇబ్బంది పడే బ్యాట్స్‌మెన్ బౌండరీలు కొట్టేందుకు సాహసించరు. అందరి ఫాస్ట్ బౌలర్లలా కాకుండా తక్కువ దూరం నుంచి పరుగెత్తుతూ బంతిని విసురుతున్నాడు. మరి వేగం విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడట్లేదు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఐసీసీ.. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
-
The science of fast bowling with @irbishi ✨
— ICC (@ICC) June 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Created by @BYJUS | #Byjus | #KeepLearning pic.twitter.com/JJ3bUp4HMm
">The science of fast bowling with @irbishi ✨
— ICC (@ICC) June 22, 2021
Created by @BYJUS | #Byjus | #KeepLearning pic.twitter.com/JJ3bUp4HMmThe science of fast bowling with @irbishi ✨
— ICC (@ICC) June 22, 2021
Created by @BYJUS | #Byjus | #KeepLearning pic.twitter.com/JJ3bUp4HMm
బ్రెట్ లీ, నెహ్రా, షమి.. వంటి ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ దూరం నుంచి పరుగెత్తుతూ వచ్చి బంతిని వేస్తారు. ఇందులో వారు తమ పేస్‌ను వాడుకుంటారు. కానీ, బుమ్రా మాత్రం తన యాంగిలర్ వేగాన్ని ఉపయోగించుకుంటాడు. అది తక్కువ ఎత్తుతో, చేతిని వేగంగా తిప్పుతూ బంతిని వదులుతాడు. దీని వల్ల బంతి వేగంలో మార్పుండదు.
ఇదీ చదవండి: WTC Final: పట్టుబిగించిన భారత్.. కివీస్@135/5