Wtc Final 2023 Winner : టెస్టు క్రికెట్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే WTC Finalలో మరోసారి భారత్ పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ఈ మహాసమరంలో ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలిచి సత్తా చాటింది. రెండోసారి ఫైనల్‌కు చేరిన భారత్.. ఈ సారైన టైటిల్ గెలిచి ఐసీసీ ట్రోఫీల కరవును తీర్చుతుందన్న అభిమానుల ఆశలపై రోహిత్ సేన నీళ్లు చల్లింది. అన్ని రంగాల్లో విఫలమై.. కీలకమైన పోరులో మరోసారి తడబాటుకు గురైన 209 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీ భారత్‌కు కలగానే మిగిలిపోయింది.
444 పరుగుల ఛేదనలో 164/3తో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమ్ ఇండియా.. ఆసీస్ బౌలింగ్ ధాటికి నిలువలేకపోయింది. రికార్డు ఛేజింగ్‌లో ఆశలు రేపిన కోహ్లీ, రహానె వికెట్లు పడిపోవడంతో.. టీమ్‌ఇండియా పతనం ప్రారంభమైంది. అర్ధశతకానికి చేరువలో కోహ్లీ(49) బోలాండ్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తర్వాత వచ్చిన జడేజా పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. రహానె(46) కూడా ఆ తర్వాత ఎక్కువ సేపు నిలవలేదు. స్టార్క్ బౌలింగ్‌లో అలెక్స్ కారేకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ ఎల్బీగా దొరికిపోగా.. చివర్లో కేఎస్ భరత్ (23) కాసేపు క్రీజ్‌లో నిలించేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరాడు.
- భారత్ : తొలి ఇన్నింగ్స్: 296.. రెండో ఇన్నింగ్స్ : 234 ఆలౌట్
- ఆస్ట్రేలియా : తొలి ఇన్నింగ్స్ : 469.. రెండో ఇన్నింగ్స్ : 270-8 (డిక్లేర్డ్)
-
Congratulations, Australia! 🇦🇺
— ICC (@ICC) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A roaring victory in the ICC World Test Championship 2023 Final 🎉#WTC23 | #AUSvIND pic.twitter.com/VE01bWheMQ
">Congratulations, Australia! 🇦🇺
— ICC (@ICC) June 11, 2023
A roaring victory in the ICC World Test Championship 2023 Final 🎉#WTC23 | #AUSvIND pic.twitter.com/VE01bWheMQCongratulations, Australia! 🇦🇺
— ICC (@ICC) June 11, 2023
A roaring victory in the ICC World Test Championship 2023 Final 🎉#WTC23 | #AUSvIND pic.twitter.com/VE01bWheMQ
-
#TeamIndia fought hard but it was Australia who won the match.
— BCCI (@BCCI) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to Australia on winning the #WTC23 Final.
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/hMYuho3R3C
">#TeamIndia fought hard but it was Australia who won the match.
— BCCI (@BCCI) June 11, 2023
Congratulations to Australia on winning the #WTC23 Final.
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/hMYuho3R3C#TeamIndia fought hard but it was Australia who won the match.
— BCCI (@BCCI) June 11, 2023
Congratulations to Australia on winning the #WTC23 Final.
Scorecard ▶️ https://t.co/0nYl21pwaw pic.twitter.com/hMYuho3R3C
-
WTC Final 2023 Teamindia vs Australia : టెస్టు క్రికెట్‌కు తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు.. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌ను 2019లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది ఐసీసీ. పాయింట్స్ టేబుల్లో టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్లతో రెండేళ్లకోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ను నిర్వహిస్తోంది. మొదటి ఎడిషన్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడగా.. కివీస్ విజయం సాధించి గదను దక్కించుకుంది. ఈ ఎడిషన్‌లో తొమ్మిది జట్లు పోటీపడగా.. మరోసారి టీమ్‌ఇండియా ఫైనల్ చేరుకుంది. అలానే భారత్‌తో తలపడేందుకు ఆస్ట్రేలియా ఈ తుదిపోరుకు అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌లోని ఓవల్వేదికగా జూన్7 నుంచి 11 వరకు జరిగిన మ్యాచ్‌లో తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. వరుసగా రెండో సారి ఓడిపోయి భారత్ ఘోర పరాభవం మూడగట్టుకుంది.
WTC Final Prizemoney : ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు గదను అందిస్తారు. దీంతో పాటు ఆ టీమ్‌కు రూ.13 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీ అందజేస్తారు. రన్నరప్‌గా నిలిచిన భారత్.. రూ.6.5 కోట్లు (8 లక్షల డాలర్లు) నగదు బహుమతి దక్కంచుకుంది.