WTC Final 2023 Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో ఒకప్పుడు ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి జట్లను చాలా తేలికగా తీసుకునేది. ఇతర జట్ల ఆటగాళ్లను మాటలతో కవ్విస్తూ ఆటతో అదరగొడుతూ ముప్పు తిప్పలు పెట్టేవారు. కంగారుల చేతిలో భారత్‌కు కూడా ఇలాంటి అనుభవాలే చాలాసార్లు ఎదురయ్యాయి. ఆస్ట్రేలియాను వాళ్ల సొంతగడ్డపై ఓడించడం అసాధ్యమేమీ కాదని టీమ్ఇండియా నిరూపించింది. రెండుసార్లు వరుసగా కోహ్లీ కెప్టెన్సీలోని టీమ్ఇండియా.. ఆసీస్ గడ్డపై చారిత్రక విజయాలు సాధించింది. ఆ విజయాల తర్వాత కంగారూ జట్టు కూడా టీమ్ఇండియాను చూసి భయపడుతుందని కోహ్లీ తెలిపాడు.
Virat Kolhi Test Captaincy : 2018-19 ఆసీస్ టూర్‌లో కోహ్లీ కెప్టెన్సీలో టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకోగా.. 2020-21లో రహానే సారధ్యంలో కూడా చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించింది. అయితే ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు విరాట్ కోహ్లీనే నాయకత్వం వహించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ స్వదేశానికి రావడం వల్ల అజింక్య రహానే టీమ్ఇండియా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇదే విషయంపై తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడాడు.
-
With rich returns in England & a master of his skill, @imVkohli knows what it takes to ace tough conditions in London, leading up to the #UltimateTest. 💪
— Star Sports (@StarSportsIndia) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Tune-in to #FollowTheBlues
June 7 | 9 AM & 12 PM | Star Sports Network & Disney+ Hotstar.#WTCFinalOnStar #BelieveInBlue pic.twitter.com/l0WG6A3lt9
">With rich returns in England & a master of his skill, @imVkohli knows what it takes to ace tough conditions in London, leading up to the #UltimateTest. 💪
— Star Sports (@StarSportsIndia) June 5, 2023
Tune-in to #FollowTheBlues
June 7 | 9 AM & 12 PM | Star Sports Network & Disney+ Hotstar.#WTCFinalOnStar #BelieveInBlue pic.twitter.com/l0WG6A3lt9With rich returns in England & a master of his skill, @imVkohli knows what it takes to ace tough conditions in London, leading up to the #UltimateTest. 💪
— Star Sports (@StarSportsIndia) June 5, 2023
Tune-in to #FollowTheBlues
June 7 | 9 AM & 12 PM | Star Sports Network & Disney+ Hotstar.#WTCFinalOnStar #BelieveInBlue pic.twitter.com/l0WG6A3lt9
"టెస్టు క్రికెట్ తొలి రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేది. ఇరు జట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండేది. కానీ మేము ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్‌లు గెలిచిన తర్వాత ఆ పోటీ కాస్త గౌరవంగా మారింది. అప్పటి నుంచి మమ్మల్ని ఆసీస్ జట్టు తేలికగా తీసుకోవడం లేదు. వారి గడ్డపై కూడా మేము గట్టి పోటీని ఇచాం. అలా అని ఆసీస్‌ను మేము కూడా తేలికగా తీసుకోం" అని కోహ్లీ పేర్కొన్నాడు.
WTC Final 2023 Oval : ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ఓవల్‌లో జరుగుతుండటంపై కూడా కోహ్లీ స్పందించాడు. అక్కడి కండిషన్స్‌కు త్వరగా అలవాటు పడి అందుకు తగినట్లు ఆటతీరు మార్చుకుంటే గెలవచ్చని విరాట్ అన్నాడు. "ఓవల్‌లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఓ రకమైన కండిషన్స్‌ను అంచనా వేయలేం. త్వరగా వాటికి అలవాటు పడాల్సిన అవసరం ఉంది. రెండు జట్లకూ ఇది ఒక టెస్ట్ సిరీస్. అక్కడి కండిషన్స్ కు త్వరగా అలవాటు పడిన జట్టే గెలుస్తుంది. డబ్ల్యూటీసీలోని గొప్పతనం అదే. రెండు జట్లు ఓ తటస్థ వేదికపై ఆడటం. అక్కడి కండిషన్లకు ఎవరు అలవాటు పడతారో చూసే అవకాశం ఇప్పుడు ఉంటుంది" అని కోహ్లీ అన్నాడు.