ETV Bharat / sports

WTC ఫైనల్​కు నెల రోజులే​​.. ఐపీఎల్​లో టీమ్​ఇండియా బిజీ.. ఆందోళనలో ఫ్యాన్స్! - ఐపీఎల్ బిజీలో భారత ఆటగాళ్లు

WTC Final 2023 : వచ్చే జూన్​ నెలలో భారత్, ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్​లో తలపడనుంది. ఓ వైపు ఆస్ట్రేలియా ప్లేయర్లు ప్రాక్టీస్ ప్రారంభిస్తే.. ఫైనల్​లో ఆడాల్సిన మన వాళ్లు ఐపీఎల్​లో బిజీగా ఉన్నారు. దీంతో సుదీర్ఘ ప్రాక్టీస్​ లేకుండా టీమ్​ఇండియా ప్లేయర్లు ఆస్ట్రేలియాను ఎలా ఎదుర్కొగలరు అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆ వివరాలు

wtc final 2023 ind vs aus
wtc final 2023 ind vs aus
author img

By

Published : May 11, 2023, 6:56 PM IST

Updated : May 11, 2023, 8:06 PM IST

WTC Final 2023 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్​ వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. జూన్​ 7న భారత్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్​ ప్రారంభం కానుంది. మొదటిసారి ఫైనల్స్​లో​ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఈ సారి ఎలాగైన టైటిల్​ నెగ్గాలని భావిస్తున్న టీమ్ఇండియాను గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే జయదేవ్ ఉనద్కత్, ఉమేశ్ యాదవ్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్​, రిషభ్​ పంత్​ దూరమవగా.. తాజాగా కేఎల్​ రాహుల్ కూడా ఈ జాబితాలో చేరాడు.

బీసీసీఐ కూడా ఎలాగైనా డబ్ల్యూటీసీ ఫైనల్స్​ గెలవాలని భావిస్తోంది. కానీ బోర్డు ఆ దిశగా సరైన అడుగులు వేయటం లేదని క్రీడా విశ్లేషకుల భావన. మొదటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్స్ విషయంలో బీసీసీఐ అలసత్వం వహిస్తుందేమో అని క్రీడాభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫైనల్స్​ కోసం ఆస్ట్రేలియా ఎప్పుడో జట్టును ప్రకటించింది. కంగారు ప్లేయర్లు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఒకరిద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్​లో ఆడుతున్నందున వారికి ఇప్పటికే ఇంగ్లాండ్​ రావాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కోరింది. నిజానికి కంగారూ జట్టు మనకంటే కొంచెం మెరుగ్గానే ఉందని చెప్పాలి. భారత జట్టులో ఒక్క పుజారా మాత్రమే ఇంగ్లాండ్​ చేరుకొని కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు.

ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​ కోసం బీసీసీఐ కొందరు ఆటగాళ్ల షెడ్యూల్​ను ఖరారు చేసింది. ఈ నెల 21తో ఐపీఎల్ లీగ్ దశ ముగుస్తుంది. ప్లే ఆఫ్స్​కు అర్హత సాధించని ఆరు జట్లు టోర్నీ నుంచి వైదొలుగుతాయి. ఈ ఆరు జట్ల నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన ప్లేయర్లను ఇంగ్లాండ్ పంపించాలని బోర్డు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

కానీ ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ చూస్తే చెన్నై, లఖ్​నవూ, ముంబయి, గుజరాత్​ జట్లు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. వీటితో పాటు బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్, కోల్​కతా జట్ల మధ్య పాయింట్ల పరంగా పెద్దగా తేడా లేనందున ఈ జట్లు కూడా ప్లే ఆఫ్స్​ రేసులో ఉన్నాయనే చెప్పవచ్చు. ఒకవేళ టేబుల్​లో ఇప్పుడున్న స్థానాల ప్రకారం టాప్​ 4 జట్లు ప్లే ఆఫ్స్ చేరుకుంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీ వీరందరూ మే నెలాఖరు వరకు భారత్​లోనే ఉండాలి. ఇక బెంగళూరు కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే.. కోహ్లీ, సిరాజ్ ఐపీఎల్ ముగిసే దాకా స్వదేశంలోనే ఉండాల్సి వస్తుంది.

దీంతో దాదాపు టీమ్​ఇండియా జట్టు మొత్తం ఐపీఎల్ ముగిసే వరకు భారత్​లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే సుమారు రెండు నెలల నుంచి టీ20 ఫార్మాట్​ ఆడుతున్న వీరు.. సరైన ప్రాక్టీస్ లేకుండా సుదీర్ఘంగా 5 రోజుల పాటు సాగే టెస్టు క్రికెట్​ ఆడగలరా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏ టెస్టు మ్యాచ్​కైనా వాతావరణం, పిచ్​ కీలకంగా వ్యవహరిస్తాయి. పైగా భారత్.. ఈ మ్యాచ్​ను పేస్‌కు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్‌ల మీద ఆడనుంది. దీంతో సుదీర్ఘమైన ప్రాక్టీస్ లేనందున ఆట మరింత కష్టతరం అవుతుంది.

Last Updated : May 11, 2023, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.