ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో(world test championship final) జాతి వివక్ష వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ కారణంగానే ఇద్దరు వీక్షకుల్ని బయటకు పంపించేశారు. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
సౌథాంప్టన్ వేదికగా ఐదోరోజు మ్యాచ్ జరుగుతోంది. రాస్ టేలర్(ross taylor) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలో ఉన్న ఇద్దరు వీక్షకులు.. అతడి జాత్యాహంకార వ్యాఖ్యలు చేస్తున్నారని ఓ మహిళ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తాను స్టేడియంలో లేనప్పటికీ, లైవ్‌లో ఆ మాటలు వినిపిస్తున్నాయని తన ట్వీట్లో పేర్కొంది. దీనిపై స్పందించిన ఐసీసీ జనరల్ మేనేజర్ క్లారీ ఫర్లాంగ్.. వారిని పంపిచేసినట్లు స్పష్టం చేశారు.
గతేడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత బౌలర్ సిరాజ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతడి కొందరు వీక్షకులు.. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. వారిని స్టేడియం సిబ్బంది, బయటకు పంపించేశారు.
ఐదోరోజు ఆట పూర్తయ్యేసమయానికి 64/2తో నిలిచి, 32 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమ్ఇండియా. బుధవారం రిజర్వ్‌డే అయిన దృష్ట్యా, ఏం జరుగుతుందో అనేది చూడాలి. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా, టై అయితే ఇరుజట్లు విజేతగా నిలుస్తాయి.
ఇవీ చదవండి: