ETV Bharat / sports

WPL 2023: దంచికొట్టిన కిరణ్​, గ్రేస్.. యూపీ బోణీ.. గుజరాత్​కు మళ్లీ నిరాశే

author img

By

Published : Mar 5, 2023, 11:07 PM IST

Updated : Mar 6, 2023, 6:23 AM IST

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో తన మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమిపాలైన గుజరాత్‌ జెయింట్స్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఉత్కంఠభరింతంగా సాగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ చేతిలో 3 వికెట్ల తేడాతో మరో ఓటమిని మూటగట్టుకుంది.

wpl 2023
wpl 2023

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో తన మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓటమిపాలైన గుజరాత్‌ జెయింట్స్‌ తన తీరు మార్చుకోలేదు. ఉత్కంఠభరింతంగా సాగిన మ్యాచ్‌లో యూపీ చేతిలో గుజరాత్‌ జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో యూపీ జట్టు పాయింట్ల ఖాతాను తెరిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యాన్ని యూపీ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కిరణ్ నవ్‌గిరే (53; 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదగా.. చివర్లో గ్రేస్ హ్యారిస్ (59; 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. యూపీ విజయానికి ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. గ్రేస్‌ రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాది ఒక బంతి మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చింది. ఎక్లెస్టోన్ (22; 12 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఆమెకు సహకారం అందించింది. అలీసా హీలే (7), శ్వేతా సెహ్రావత్ (5), తాహిలా మెక్‌గ్రాత్‌ (0), దీప్తి శర్మ (11), సిమ్రాన్ షేక్ (0), దేవికా వైద్య (4) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ (5/16) ఆకట్టుకోగా.. మాన్సీ జోషి, అనాబెల్ ఒక వికెట్ పడగొట్టింది.

గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్‌ డియోల్‌ (46; 32 బంతుల్లో 7 ఫోర్లు) రాణించగా.. సబ్బినేని మేఘన (24; 15 బంతుల్లో 5 ఫోర్లు), ఆష్లీన్‌ గార్డెనర్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, తాహిలా మెక్‌గ్రాత్, అంజలి తలో వికెట్ తీశారు.

Last Updated : Mar 6, 2023, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.