ETV Bharat / sports

WPL 2023: తొలి మ్యాచ్​కు ముందే గుజరాత్​​ టైటాన్స్​కు షాక్​ - డబ్ల్యూపీఎల్ 2023 గుజరాత్ టైటాన్స్​ కిమ్​ గార్త్​

మరి కొన్ని గంటల్లో మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్ 2023​) తొలి సీజన్‌ ప్రారంభంకానుంది. ముంబయి ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనున్న మ్యాచ్​తో ఈ ఆరంభ సీజన్ మొదలుకానుంది. అయితే తొలి మ్యాచ్​కు ముందు గుజరాత్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ వివరాలు..

WPL 2023 Gujarat Giants
WPL 2023: తొలి మ్యాచ్​కు ముందే గుజరాత్​​ టైటాన్స్​కు షాక్​
author img

By

Published : Mar 4, 2023, 1:23 PM IST

క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్ 2023​) తొలి సీజన్‌కు సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ముంబయి ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనున్న మ్యాచ్​తో ఈ ఆరంభ సీజన్​ ప్రారంభకానుంది. ముంబయిలోని డివై పాటిల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వేదికగా నేడు(మార్చి 4) సాయంత్రం 7:30 గంటలకు ఈ పోరు షురూ కానుంది. అయితే ఇప్పుడు తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్ జెయింట్స్‌కు ఓ ఊహించని షాక్‌ తగిలింది. ఇంకా చెప్పాలంటే గట్టి దెబ్బే తగిలింది.

ముంబయి వేదికగా జరిగిన ఆక్షన్​లో వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డియాండ్రా డాటిన్​ను రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ప్లేయర్​ గాయం ​కారణంగా తప్పుకుంది. ఈ సీజన్ మొత్తానికి దూరమైంది. దీంతో గుజరాత్‌ ఫ్రాంచైజీ.. తమ టీమ్​లోని డియాండ్రా డాటిన్‌ స్థానాన్ని ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్‌ కిమ్ గార్త్‌తో భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా గుజరాత్ ఫ్రాంచైజీ ట్వీట్​ చేసి తెలిపింది. అయితే బేస్​ ప్రైస్​ రూ.60 లక్షలకు గార్త్‌తో గుజరాత్‌ జెయింట్స్​ ఒప్పందం కుదుర్చుకున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆక్షన్​లో కిమ్ గార్త్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు డాటిన్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రిచ్‌ లీగ్‌లో భాగమయ్యే అవకాశం గార్త్​కు లభించింది. ఇకపోతే ఈ లీగ్‌లో గుజరాత్‌ జట్టుకు ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ బెత్ మూనీ సారథిగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఆష్లీ గార్డ్‌నర్‌, డాటిన్‌, సోఫియా డంక్లీ, స్నేహ్‌ రాణా ఈ జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. అలానే ముంబయి కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంపిక అయింది. ఈ టీమ్​లో నాట్‌ సీవర్‌, హీథర్‌ గ్రాహమ్‌, పూజ వస్త్రాకర్‌, యాస్తిక భాటియా కీలక ప్లేయర్స్​గా ఉన్నారు.

ఇకపోతే ఈ డబ్ల్యూపీఎల్‌ ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. మ్యాచ్‌ ప్రారంభానికి రెండు గంటల ముందే సాయంత్రం 5.30కు ఓ స్పెషల్​ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బాలీవుడ్‌ భామలు కియారా అద్వాణీ, కృతి సనన్‌ ఈ కార్యక్రమంలో డ్యాన్స్​ షో చేయనున్నారు. అలాగే ప్రముఖ సింగర్​ శంకర్‌ మహాదేవన్‌ కూడా డబ్ల్యూపీఎల్‌ నేపథ్య గీతాన్ని ఆలపించనున్నారు. ర్యాపర్‌, గాయకుడు ఏపీ ధిల్లాన్‌ కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఇదీ చూడండి: విరాట్​ కోహ్లీ హాఫ్​ సెంచరీ చేయక 10ఏళ్లా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.