ETV Bharat / sports

WTC Final :ఈ 'గద' వెనకున్న కథ ఇది! - డబ్ల్యూటీసీ ఫైనల్​ 2023 విన్నర్​కు గద

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు ఐసీసీ భారీ ప్రైజ్​ మనీతో పాటు ఓ గదను బహుకరిస్తుంది. అయితే ఈ గదను అందించేందుకు అసలు కారణం ఏంటంటే?

wtc final 2023 mace behind the story
wtc final 2023 mace
author img

By

Published : Jun 7, 2023, 1:39 PM IST

WTC Final Trophy 2023 : ఇంగ్లాండ్​లోని రోస్​బౌల్ వేదికగా.. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​ జరిగింది. ఇందులో భాగంగా టీమ్‌ఇండియాతో కివీస్‌ జట్టు తలపడింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్​లో ఆఖరికి విజయం న్యూజిలాండ్​ జట్టును వరించింది. ఇక ఈ మ్యాచ్​తో తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచిన కివిస్​ జట్టు విజయ ఢంకాను మోగించింది. ఆ సమయంలో ఐసీసీ న్యూజిలాండ్‌ జట్టుకు ఓ బంగారం వర్ణంలో ఉన్న 'గద'ను బహూకరించింది. దాంతో పాటు భారీ ప్రైజ్‌మనీని కుడా అందించింది.

సాధారణంగా మెగా టోర్నీల్లో గెలిచిన జట్టుకు ఓ కప్‌ను బహుంకరించడం ఆనవాయితీ. కానీ, ఐసీసీ మాత్రం వినూత్నంగా ఓ 'గద'ను విజేతలకు అందించడంతో అభిమానుల్లో ఈ విషయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పుడు రెండో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. ఈసారి కూడా టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకొచ్చి ఆసీస్‌తో తలపడేందుకు రంగంలోకి దిగనుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఛాంపియన్‌గా నిలిచి ఈసారైనా భారత్‌.. ఆ గదను దక్కించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ఆ 'గద' గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..

wtc final 2023 mace behind the story
గదతో కెప్టెన్లు

WTC Final Prize Money 2023 : గతంలో జరిగిన టెస్టుల్లో టాప్​ పొజిషన్​కు చేరుకున్న జట్టుకు ఈ గదను అందించేవారు. అయితే ఇప్పుడు ఆ ఆనవాయితీని ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్​లో అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఫైనల్​ విజేతకు ఈ గదను ఇస్తున్నారు. దీంతో పాటు గెలిచిన జట్టుకు అక్షరాల 1.6 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ కూడా ఇస్తారు.

మరోవైపు రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు దక్కుతాయి. ఇక ఇలాంటి గదను ఐసీసీ 2000 సంవత్సరంలోనే తయారు చేయించింది. ట్రావెర్ బ్రౌన్‌ అనే డిజైనర్ ఈ అద్భుతమైన గదను రూపొందించారు. దీన్ని రూపొందించేందుకు స్పూర్తినిచ్చిన అంశాలను కూడా ఆయన ఒకానొక సందర్భంలో వెల్లడించారు.

"ఇలాంటి డిజైన్‌ను రూపొందించడానికి నాకు స్ఫూర్తిగా నిలిచిన సంఘటన ఒకటి ఉంది. ఉత్కంఠభరితంగా సాగిన ఓ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు సభ్యులు మైదానంలోని స్టంప్‌ను తీసుకుని సంబరాలు చేసుకోవడాన్ని నేను చూశాను. దీంతో స్టంప్‌ను బేస్​ చేసుకుని ఈ గదను తయారు చేయడానికి స్ఫూర్తి పొందాను" అని బ్రౌన్‌ వివరించారు.

ఇక క్రికెట్‌లో ప్రధానమైన బంతిని మేయిన్​ పాయింట్​గా చేసుకొని ఈ గదను తయారు చేశారట. అయితే ఇలా ఈ బంతి టెస్ట్‌ క్రికెట్‌ ప్రపంచ స్థాయిని తెలియజేస్తుంది. గద హ్యాండిల్‌ క్రికెట్‌ స్టంప్‌ను సూచిస్తుంది. హ్యాండిల్‌ చుట్టూ రిబ్బన్‌ చుట్టి ఉంటుంది. ఈ రిబ్బన్‌ను విజయానికి చిహ్నంగా భావిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.