World Cup 2023 Youngest Player : 2023 ప్రపంచ కప్‌నకు మరో రెండు రోజులే మిగిలి ఉంది. యావత్ క్రికెట్ ప్రియులను 45 రోజులపాటు ఉర్రూతలూగించేందుకు ఈ మెగాటోర్నీ సిద్ధమైపోయింది. అయితే ఏ క్రీడలోనైనా.. యంగ్ ప్లేయర్లు కొత్త ఎనర్జీతో తమదైన ముద్ర వేస్తారు. అలాగే క్రికెట్లో కూడా ప్రతీ వరల్డ్ కప్‌లో యువ ఆటగాళ్లు రావడం సాధారణం. ఈ క్రమంలో 2023 వరల్డ్ కప్‌లో ఆడనున్న 5 గురు యువ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
నూర్ అహ్మద్.. అఫ్గానిస్థాన్ దేశానికి చెందిన 18 ఏళ్ల నూర్ అహ్మద్.. ఈ ప్రపంచకప్‌లో ఆడే ప్లేయర్లలో అందరి కంటే చిన్నవాడు. నేటికి అతడి వయసు 18 సంవత్సరాల 254 రోజులు. నూర్.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అఫ్గానిస్థాన్ తరఫున నూర్ ఇప్పటి వరకు 3 వన్డేలు, 1 టీ20 మ్యాచ్‌లో మొత్తం 6 వికెట్లు పడగొట్టాడు.
ఆర్యన్ దత్.. నెదర్లాండ్ లెఫ్టార్మ్ బౌలర్ ఆర్యన్ దత్ వయసు 20 ఏళ్ల 119 రోజులు. ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే అతి పిన్న వయస్కుల లిస్ట్‌లో ఆర్యన్ రెండో ప్లేయర్. ఆర్యన్ 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటినుంచి అతడు నెదర్లాండ్ తరఫున 25 వన్డేల్లో 5.17 ఎకానమీ రేటుతో 20 వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్‌లోనూ రాణించి..965 పరుగులు చేశాడు. వన్డేల్లో 3-31 అతడి అత్యుత్తమ ప్రదర్శన.
రియాజ్ హసన్.. అఫ్గానిస్థాన్‌కు చెందిన మరో ఆటగాడు రియాజ్ హసన్ ఆ జాబితాలో ముడో స్థానంలో ఉన్నాడు. అతడి వయసు 20 సంవత్సరాల 311 రోజులు. 2022లో అరంగేట్రం చేసిన రియాజ్.. 4 వన్డేల్లో 68 స్ట్రైక్ రేట్‌తో 120 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది.
తంజిమ్ హసన్ షకీబ్.. బంగ్లాదేశ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ తంజిమ్ హసన్.. ఈ ప్రపంచకప్‌లో ఆడనున్న అతి పిన్న వయస్కుల్లో నాలుగో ప్లేయర్. అతడి వయసు 20 సంవత్సరాల 342 రోజులు. తంజిమ్ ఇటీవల జరిగిన 2023 ఆసియా కప్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ మినీటోర్నీలో రెండు మ్యాచ్లుల ఆడిన తంజీమ్.. 2 వికెట్లు పడగొట్టాడు.
విక్రమ్‌జీత్ సింగ్.. నెదర్లాండ్‌కు చెందిన విక్రమ్ జీత్ సింగ్.. వరల్డ్‌కప్‌లో ఆడనున్న ఐదో అతి పిన్న వయస్కుడు. విక్రమ్‌జీత్ వయసు 20 సంవత్సరాల 343 రోజులు. ఇప్పటివరకూ 25 వన్డే మ్యాచ్‌లు ఆడిన విక్రమ్.. 32.32 సగటుతో 808 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ICC World Cup 2023 : వరల్డ్ కప్‌లో టాప్ 5 నెదర్లాండ్స్ ప్లేయర్స్.. వీరిని ఎదుర్కోవడం కష్టమే!
ICC world cup 2023 : భారత్ వరల్డ్‌కప్ గెలవాలంటే ఈ అడ్డంకులు దాటాల్సిందే.. అది సాధ్యమేనా?