World Cup 2023 Semi Finals Venue : ఇప్పటివరకు ఎంతో రసవత్తరంగా సాగిన ప్రపంచకప్‌లో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. క్వార్టర్స్‌లో క్యాలిఫై అయిన నాలుగు జట్లు.. సెమీస్ పోరుకు సిద్ధమౌతున్నాయి. ముంబయిలోని వాంఖడే వేదికగా బుధవారం జరగనున్న తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ -భారత్ తలపడనుడగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జట్లు రంగంలోకి దిగనున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు వేదికల గురించి నెట్టింట చర్చ కొనసాగుతోంది. ఈ రెండు పిచ్‌లు ఎవరికి అనుకూలిస్తాయి? అక్కడ పరుగుల వరద పారుతుందా? వికెట్ల హోరు సాగుతుందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలైంది.
-
🕹 Choose your winning #CWC23 team 🏆 pic.twitter.com/YCYLpNPUsO
— ICC (@ICC) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🕹 Choose your winning #CWC23 team 🏆 pic.twitter.com/YCYLpNPUsO
— ICC (@ICC) November 13, 2023🕹 Choose your winning #CWC23 team 🏆 pic.twitter.com/YCYLpNPUsO
— ICC (@ICC) November 13, 2023
వాంఖడే.. ఇక పరుగుల వరదే!
India Vs Newzealand World Cup 2023 : ఇక భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు వేదికగా నిలవనున్న వాంఖడే స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకుల మాట. ఎందుకంటే ఇప్పటివరకూ ఈ ప్రపంచకప్‌లో ఈ వేదికపై జరిగిన మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ రెండు మ్యాచ్‌లాడిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్‌పై 399/7, బంగ్లాదేశ్‌పై 382/5 పరుగులు సాధించి రికార్డుకెక్కింది.
-
New Zealand warm up for the semi-finals with some ⚽ in their training session 👊#CWC23 pic.twitter.com/MbDP1RyeJr
— ICC (@ICC) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">New Zealand warm up for the semi-finals with some ⚽ in their training session 👊#CWC23 pic.twitter.com/MbDP1RyeJr
— ICC (@ICC) November 13, 2023New Zealand warm up for the semi-finals with some ⚽ in their training session 👊#CWC23 pic.twitter.com/MbDP1RyeJr
— ICC (@ICC) November 13, 2023
మరోవైపు టీమ్ ఇండియా కూడా వాంఖడేలో మంచి స్కోర్ నమోదు చేసింది. శ్రీలంకపై 357/8 స్కోరు సాధించింది. అంతే కాకుండా ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ జట్టు 291/5 స్కోరు చేయగా.. ఛేదనలో మ్యాక్స్‌వెల్ అద్భుత ద్విశతకంతో కంగారూ జట్టు లక్ష్యాన్ని చేరుకుంది. అయితే బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. తొలి బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయొచ్చు. ఈ ఎర్రమట్టి పిచ్ ఆట సాగుతున్నా కొద్దీ పేసర్లు, స్పిన్నర్లకూ అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఛేదనలో పరిస్థితులు బౌలింగ్‌కు అనువుగా మారే ఆస్కారముంది.
ఈడెన్.. సత్తా చూపించెన్..
South Africa Vs Australia : ఇక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్ జరగనుంది. ఈ స్టేడియంలో పిచ్ బౌలింగ్, బ్యాటింగ్‌కు సమానంగా సహకరించే అవకాశాలున్నాయి. ఈ టోర్నీలో ఇక్కడ మొదట బంగ్లాదేశ్‌పై 229 పరుగులు చేసిన నెదర్లాండ్స్.. అనంతరం ప్రత్యర్థిని 142కే ఆలౌట్ చేసింది. మరో మ్యాచ్‌లో మొదట బంగ్లా 204 చేయగా.. పాకిస్థాన్ 32.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇక సౌతాఫ్రికాపై భారత్ 326/5 భారీ స్కోరు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగి సఫారీ జట్టును 83కే కుప్పకూల్చింది. పాకిస్థాన్‌పై ఆసీస్ జట్టు కూడా 337/9 స్కోరు చేసి 93 పరుగుల తేడాతో విజయతీరాలకు చేరుకుంది. ఈ స్కోర్లు చూస్తే ఇక్కడి పిచ్ మొదట బ్యాటింగ్‌కు, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు సహకరించేలా కనిపిస్తోంది. అయితే బలమైన బౌలింగ్ ఉంటే మొదట కూడా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి.
-
Semi-final preparations are underway for the Proteas 🇿🇦#CWC23 pic.twitter.com/SQSmv15DLG
— ICC (@ICC) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Semi-final preparations are underway for the Proteas 🇿🇦#CWC23 pic.twitter.com/SQSmv15DLG
— ICC (@ICC) November 13, 2023Semi-final preparations are underway for the Proteas 🇿🇦#CWC23 pic.twitter.com/SQSmv15DLG
— ICC (@ICC) November 13, 2023
సెమీ ఫైనల్స్ అంపైర్లు ఫిక్స్ - టీమ్ఇండియా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ! ఎందుకో తెలుసా?
గ్రూప్ స్టేజ్‌లో బెస్ట్ పెర్ఫార్మర్స్ - టీమ్ఇండియా ప్లేయర్లదే డామినేషన్!