ETV Bharat / sports

World Cup 2023 Pakistan Semis : సెమీస్​కు పాక్?..​ ఈ '10' ఛాన్సులు వర్కౌట్​ అయితేనే! - ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌కు అవకాశాలు

World Cup 2023 Pakistan Semis Chance : ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్‌.. రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఆ జట్టు సెమీస్​కు చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే ఇప్పటికీ ఆ జట్టు సెమీస్ చేరే అవకాశాలున్నాయి. అదెలాగో తెలుసుకుందాం.

world cup 2023 pakistan semis chance
world cup 2023 pakistan semis chance
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 7:52 AM IST

Updated : Oct 29, 2023, 8:24 AM IST

World Cup 2023 Pakistan Semis Chance : పాకిస్థాన్ కచ్చితంగా సెమీ ఫైనల్స్‌కు వస్తుందని.. ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు చాలామంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ పాక్‌ ఆట తీరుతో ఆ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. మొదటి రెండు మ్యాచ్‌ల్లో (నెదర్లాండ్స్‌, శ్రీలంకపై) మాత్రమే విజయం సాధించింది పాక్​. ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచుల్లో వరుసగా ఓటమి పాలైంది.

దీంతో సెమీస్‌ రేసులో పాకిస్థాన్​ జట్టు చాలా వెనుకబడి పోయింది. అయితే సెమీస్‌ చేరేందుకు పాక్​కు ఇంకా అవకాశాలు ఉన్నాయి. కానీ, అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. మరి, పాక్‌ సెమీస్‌కు రావాలంటే సమీకరణాలు ఎలా ఉన్నాయో ఈ 10 పాయింట్లలో తెలుసుకుందాం.

  • పాకిస్థాన్‌ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కచ్చితంగా భారీ తేడాతో గెలుపొందాలి. అప్పుడే ఆ జట్టుకు సెమీస్​కి వెళ్లే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
  • బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్, ఇంగ్లాండ్​తో పాకిస్థాన్​ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌ నుంచి పాక్‌కు గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది.
  • న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆరు మ్యాచ్‌లు ఆడి.. అందులో నాలుగు గెలిచి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
  • కివీస్‌, ఆసీస్‌ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతేనే.. పాక్‌ సెమీస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
  • ఒక వేళ న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా ఒక్కో మ్యాచ్‌ గెలిచినా.. పాక్‌కు అవకాశం ఉంటుంది.
  • అప్పుడు తన మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ భారీ తేడాతో విజయం సాధించి.. ఆ జట్ల కంటే ఎక్కువ నెట్‌ రన్‌రేట్​ను సొంతం చేసుకోవాలి.
  • ఇప్పటి వరకు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ ఐదేసి మ్యాచ్‌లు ఆడి రెండింటిలో విజయం సాధించాయి.
  • ఆ రెండు జట్లు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో.. కనీసం రెండు మ్యాచ్‌ల్లో ఓడితే పాక్‌ సులభంగా సెమీస్‌కు చేరుతుంది.
  • ఒకవేళ అఫ్గాన్‌, శ్రీలంక మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచినా.. పాక్‌కు సెమీస్​కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.
  • అప్పుడు పాకిస్థాన్‌ జట్టు మూడు మ్యాచుల్లోనూ భారీ తేడాతో గెలిచి.. ఆ జట్ల కంటే ఎక్కువ నెట్‌ రన్‌రేట్‌ కలిగి ఉండాలి.

Aus vs Nz World Cup 2023 : విరాట్​ను అధిగమించిన వార్నర్.. స్టార్క్​ తొలిసారి అలా.. ఉత్కంఠభరిత పోరులో రికార్డులివే

NED vs BAN World Cup 2023 : ప్రపంచకప్​లో మరో సంచలనం.. నెదర్లాండ్స్​కు రెండో విజయం.. బంగ్లా చిత్తు!

Last Updated : Oct 29, 2023, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.