World Cup 2023 Glenn Maxwell : దిల్లీ వేదికగా బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం వరల్డ్ కప్ టోర్నీలు నిర్వహిస్తున్న బీసీసీఐపై ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మండిపడినట్లు తెలుస్తోంది. మ్యాచ్ మధ్యలో ఆడియెన్స్ కోసం నిర్వహిస్తున్న నైట్ క్లబ్ లైట్ షో విషయంపై కోపడ్డాడు. ఆ షోను ఏర్పాటం చేయటం కన్నా మరొక చెత్త నిర్ణయం ఇంకొకటి లేదన్నాడు. నెదర్లాండ్స్‌తో మ్యాచులో రికార్డులు బద్దలు కొట్టిన కాసేపటికే మ్యాక్స్‌వెల్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. అనంతరం నెదర్లాండ్స్ బ్యాటింగ్ సమయంలో ఎప్పట్లాగే డ్రింక్స్ బ్రేక్‌లో లైట్ షో నిర్వహించారు. వరల్డ్ కప్‌లో జరుగుతున్న ప్రతి మ్యాచులోనూ ప్రేక్షకులకు ఎంజాయ్‌మెంట్ కోసం ఈ లైట్ షో వేస్తున్నారు. అయితే ఇది ముగిసిన వెంటనే కళ్లు మూసుకొని చాలా ఇబ్బంది పడినట్లుగా మ్యాక్స్ కనిపించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ లైట్ షోపై మండిపడ్డాడు.
'బిగ్ బాష్‌లో ఆడుతున్నప్పుడు కూడా ఒకసారి పెర్త్‌లో ఇలాగే లైట్ షో ఏర్పాటు చేశాడు. అప్పుడే నాకు బాగా తలనొప్పి వచ్చేసింది. ఇప్పుడు కూడా ఈ షో ముగిసిన తర్వాత కళ్లు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే సాధ్యమైనంతగా కళ్లు మూసుకొని ఈ లైట్స్ చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ లైట్ షో ఆడియెన్స్‌కు బాగుంటుంది కానీ ప్లేయర్లకు మాత్రం నరకంగా కనిపిస్తుంది. ప్లేయర్ల విషయంలో ఇంత కన్నా చెత్త నిర్ణయం మరొకటి ఉండదు" అని మ్యాక్స్‌వెల్ అన్నాడు.
కొన్ని రోజుల క్రితం టీమ్ఇండియా - కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి లైట్ షోనే నిర్వహించారు. అప్పుడు కూడా శ్రేయస్ అయ్యర్ దీని వల్ల ఇబ్బంది పడి ఔట్ కూడా అయ్యాడు! లైట్ షో ముగిసిన వెంటనే కళ్లు అడ్జస్ట్ అవ్వడానికి సమయం పట్టడం సహజమే. అయితే ఈ క్రమంలోనే పూర్తిగా కళ్లు అడ్జస్ట్ అవ్వకపోవడం వల్లనే శ్రేయస్ అయ్యర్ ఔటై ఉంటాడని అప్పుడు కొంత మంది ఫ్యాన్స్ అన్నారు. కానీ, అయ్యర్ మాత్రం దీనిపై స్పందించలేదు. దీంతో ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మ్యాక్స్‌వెల్ ఇలా మాట్లాడటం వల్ల అందరూ శ్రేయస్ అయ్యర్ ఔట్‌ను గుర్తుచేస్తున్నారు.
-
The greatest showman 🎩
— ICC Cricket World Cup (@cricketworldcup) October 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Highlights 🎥 https://t.co/tMX9aULErd#CWC23 pic.twitter.com/1i8biFY1ry
">The greatest showman 🎩
— ICC Cricket World Cup (@cricketworldcup) October 26, 2023
Highlights 🎥 https://t.co/tMX9aULErd#CWC23 pic.twitter.com/1i8biFY1ryThe greatest showman 🎩
— ICC Cricket World Cup (@cricketworldcup) October 26, 2023
Highlights 🎥 https://t.co/tMX9aULErd#CWC23 pic.twitter.com/1i8biFY1ry
World Cup Fastest Centuries : ప్రపంచ కప్‌లో సెంచరీల మోత.. ఫాస్టెస్ట్ సెంచరీ వీరులు వీరే