ETV Bharat / sports

సెంచరీలతో స్మృతి, హర్మన్​ అదరహో.. విండీస్​​ లక్ష్యం ఎంతంటే?

Worldcup 2022 IND VS WI: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నేడు(శనివారం) జరుగుతున్న మ్యాచ్​లో భారత్ జట్టు ​అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థి జట్టు వెస్టిండీస్​కు 318 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటర్లు స్మృతి మంథాన, హర్మన్​ ప్రీత్​ కౌర్​ సెంచరీలతో మెరిశారు.

women cricket team
smruthi, harman
author img

By

Published : Mar 12, 2022, 10:15 AM IST

Worldcup 2022 IND VS WI: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్​తో జరుగుతోన్న మ్యాచ్​లో టీమ్​ఇండియా అదరగొట్టింది. స్మృతి మంథాన(123) సెంచరీ, హర్మన్​ప్రీత్​ కౌర్​(109) ధనాధన్​ ఇన్నింగ్స్​ తోడవ్వడం వల్ల.. నిర్ణీత 50ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. యాస్తిక(31) పర్వాలేదనిపించగా మిగతా వారు విఫలమయ్యారు. కాగా, విండీస్​​ బౌలర్లలో అనిస మహమ్మద్​ 2 వికెట్లు తీయగా.. షమిలియా, షకేరా, హేలే, దయేంద్ర, యాలియా చెరో వికెట్ పడగొట్టారు.

మిథాలీరాజ్​ రికార్డు..

ఈ మ్యాచ్​తో కెప్టెన్​ మిథాలీ రాజ్​ ఓ రికార్డు సృష్టించింది. మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్​గా నిలిచింది. ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆస్ట్రేలియా లెజెండ్ బెలిండా క్లార్క్‌ను మిథాలీ అధిగమించింది. వరల్డ్​కప్​ ఆరు ఎడిషన్లలోనూ పాల్గొన్న మహిళా క్రికెటర్‌గా మిథాలీ మరో రికార్టును తన ఖాతాలో వేసుకుంది.

ఇదీ చదవండి: పింక్​ టెస్ట్​.. శ్రీలంకతో పోరుకు టీమ్​ఇండియా రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.