ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన రెండో వన్డే(indw vs ausw 2021)లో భారత మహిళా జట్టు పోరాడి ఓడింది. ఆఖరి బంతి వరకు జరిగిన ఈ పోరులో వివాదాస్పద నోబాల్ కారణంగా ఆసీస్‌ను విజయం వరించింది. దీంతో వన్డే సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయింది భారత్. ఆఖరి వన్డే మ్యాచ్ ఆదివారం జరగనుంది. దీంతో వరుసగా మూడో సిరీస్‌ను భారత్ కోల్పోవడం గమనార్హం. ఇంతకుముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ చేతుల్లో మిథాలీ సేన పరాజయం పాలైంది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 274 పరుగులు చేసింది. స్టైలిష్ ఓపెనర్ స్మృతి మంధాన 86 పరుగులతో రాణించగా.. రిచా గోష్ (44) పర్వాలేదనిపించింది. మిగిలిన వారిలో షెఫాలీ (22), దీప్తి శర్మ (23), పూజా వస్త్రాకర్ (29), జులాన్ గోస్వామి (28) కాసేపు క్రీజులో నిలిచారు. దీంతో ఆసీస్ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది భారత్.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే అలిసా హేలీని క్లీన్ బౌల్డ్ చేసింది గోస్వామి. మెగ్ లాంగ్ (6), ఎలిస్ పెర్రీ (2), గార్డెనర్ (12) కూడా విఫలమవడం వల్ల 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్. కానీ మరో ఓపెనర్ బెత్ మూనీతో కలిసి మెక్‌గ్రాత్ జట్టును విజయతీరాలకు చేర్చింది. మూనీ సెంచరీ (125*)తో నాటౌట్‌గా నిలవగా.. మెక్‌గ్రాత్ 74 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
నో బాల్ వివాదం
చివరి ఓవర్‌ను జులాన్ గోస్వామి చేతికి ఇచ్చింది కెప్టెన్ మిథాలీ రాజ్. ఈ ఓవర్లో ఆసీస్ విజయానికి 13 పరుగులు కావాల్సి ఉంది. అయితే అధిక ఒత్తిడితో మిస్‌ఫీల్డ్ చేసి ప్రత్యర్థికి అదనపు పరుగుల్ని సమర్పించుకుంది భారత్. ఇక చివరి బంతికి 3 పరుగులు కావాల్సి ఉంది. ఈ బంతిని స్వ్కేర్ లెగ్ దిశగా ఆడి క్యాచ్ ఔట్ అయింది నికోలా కారే. అంతే భారత శిబిరంలో విజయోత్సవాలు మిన్నంటాయి. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఈ బంతిని నో బాల్ అన్న అనుమానంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేయగా.. ఆ బాల్ నడుముపైకి వస్తుందన్న కారణంతో నో బాల్‌గా ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియా చివరి బంతికి విజయం సాధించింది.
అభిమానుల విమర్శలు
ఆస్ట్రేలియా బ్యాటర్ కారే క్రీజు బయట ఉందని.. అలాగే ఆమె బంతిని ఆడే సమయంలో కాస్త వంగిందని.. అలాంటపుడు నో బాల్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. ఆస్ట్రేలియాకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించారని విమర్శిస్తున్నారు. భారత పోరాట పటిమను మెచ్చుకుంటున్నారు.
-
No ball? Y/N#AUSvIND pic.twitter.com/QP70Obgqbl
— cricket.com.au (@cricketcomau) September 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">No ball? Y/N#AUSvIND pic.twitter.com/QP70Obgqbl
— cricket.com.au (@cricketcomau) September 24, 2021No ball? Y/N#AUSvIND pic.twitter.com/QP70Obgqbl
— cricket.com.au (@cricketcomau) September 24, 2021
-
The batter was out of her crease, she was bending as well and yet it was called a no ball. Frankly this will haunt us for a long time. Very tough to digest this one. @BCCIWomen
— Boria Majumdar (@BoriaMajumdar) September 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The batter was out of her crease, she was bending as well and yet it was called a no ball. Frankly this will haunt us for a long time. Very tough to digest this one. @BCCIWomen
— Boria Majumdar (@BoriaMajumdar) September 24, 2021The batter was out of her crease, she was bending as well and yet it was called a no ball. Frankly this will haunt us for a long time. Very tough to digest this one. @BCCIWomen
— Boria Majumdar (@BoriaMajumdar) September 24, 2021
-
It wasn't no ball. But we didn't deserve the win. We can't take the pressure. What a shit fielding. #AUSvIND
— RAVI RANJAN ऊँ (@Im_ravi10) September 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">It wasn't no ball. But we didn't deserve the win. We can't take the pressure. What a shit fielding. #AUSvIND
— RAVI RANJAN ऊँ (@Im_ravi10) September 24, 2021It wasn't no ball. But we didn't deserve the win. We can't take the pressure. What a shit fielding. #AUSvIND
— RAVI RANJAN ऊँ (@Im_ravi10) September 24, 2021