ETV Bharat / sports

త్వరలో మహిళల ఐపీఎల్..  జైషా క్లారిటీ

Women IPL: మహిళల ఐపీఎల్​ను త్వరలోనే ప్రారంభించేందుకు బోర్డు సన్నాహాలు చేస్తుందని తెలిపారు బీసీసీఐ సెక్రటరీ జైషా. కొన్నిరోజుల్లో దీనిపై స్పష్టతనిస్తామని చెప్పారు.

మహిళల ఐపీఎల్​, women ipl
మహిళల ఐపీఎల్​
author img

By

Published : Dec 29, 2021, 7:27 PM IST

Women IPL: మహిళల ఐపీఎల్​ను నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు కసరత్తులు చేస్తుందని స్పష్టం చేశారు బీసీసీఐ సెక్రటరీ జైషా. పురుషుల ఐపీఎల్​ తరహాలోనే దీన్ని రూపొందించబోతున్నట్లు తెలిపారు.

"మహిళల టీ20 ఛాలెంజ్​ అభిమానుల్లో భారీ ఆసక్తిని నెలకొల్పింది. మహిళల క్రికెట్​ను ప్రోత్సాహిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం. వారి కోసం ఐపీఎల్​ లాంటి ఓ లీగ్​ కావాలి. కేవలం మూడు, నాలుగు జట్ల మధ్య పోటీని నిర్వహించడం మాత్రమే కాదు మహిళల ఐపీఎల్​ లీగ్​ను ప్రారంభించడం లాంటిది. ఇందులోకి చాలా అంశాలు వస్తాయి. అంతర్జాతీయ స్టార్​లు, బోర్డు సభ్యుల మధ్య ద్వైపాక్షిక కమిట్​మెంట్స్​ ఇలా చాలా ఉంటాయి. భవిష్యత్​ మహిళా క్రికెటర్ల కోసం ఈ లీగ్​ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నాం. భారతదేశంలో క్రికెట్ స్థాయిని మరింత పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. స్మృతి మంధాన, హర్మన్​ప్రీత్​ కౌర్​ లాంటి ప్లేయర్స్​ కూడా ఈ లీగ్​ను తీసుకురావాలని కోరుతున్నారు. ఎందుకంటే ఇది ప్లేయర్స్​కు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ది హండ్రెడ్​ లీగ్​, డబ్ల్యూబీబీఎల్​ వంటి లీగ్స్​లో దీప్తి శర్మ, రోడ్రిగ్స్​, షెఫాలీ వర్మ, పూనమ్​ యాదవ్​ వంటి ఆటగాళ్ల అదరగొడుతున్నారు. రోల్​ మోడల్స్​గా ఎదుగుతున్నారు." అని జైషా అన్నారు.

ఈ ఏడాది జరిగిన బిగ్​బాష్​ లీగ్​లో ఎనిమిది మంది భారత మహిళా క్రికెటర్లు పాల్గొన్నారు. 15 వికెట్లు, 399 పరుగులతో హర్మన్​ప్రీత్​ కౌర్​ ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ అవార్డును అందుకుంది. ఈ అవార్డు అందుకున్న తొలి భారత ప్లేయర్​గా నిలిచింది. ది హండ్రెడ్​ లీగ్​లో షెఫాలీ వర్మ, హర్మన్​ ప్రీత్ కౌర్​, రోడ్రిగ్స్​, స్మృతిమంధాన, దీప్తి శర్మ ఆడారు. ఈ టోర్నీలో 249 అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్​గా రోడ్రిగ్స్​ నిలవడం విశేషం. దీప్తి.. 8 మ్యాచ్​ల్లో 13.6 సగటు, 5.26 ఎకానమీ, 15.5 స్ట్రైక్​రేట్​తో పది వికెట్లు తీసింది.

ప్రస్తుతం బీసీసీఐ మహిళల కోసం మూడు జట్లతో టీ20 లీగ్​ నిర్వహిస్తుంది. ట్రయల్​బ్లేజర్స్, సూపర్​నొవాస్, వెలాసిటీ జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి. అయితే మూడుకు బదులు ఆరు జట్లతో లీగ్​ నిర్వహిస్తే మహిళా జట్లు కూడా మరింత బలంగా తయారవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీసీఐ మహిళల ఐపీఎల్​ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని దాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చూడండి: 'ఆరు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.