ETV Bharat / sports

ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోనున్నాడా? - Virat Kohli RCB captaincy

టీ20 కెప్టెన్సీ(virat kohli t20 captaincy record)కి గుడ్​బై చెప్పబోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్​కు గురిచేశాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. అతడి నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు ఐపీఎల్ కెప్టెన్సీ(virat kohli ipl captaincy record) నుంచి కూడా తప్పుకోవాలని సూచిస్తున్నారు.

Kohli
కోహ్లీ
author img

By

Published : Sep 17, 2021, 5:10 PM IST

టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల(virat kohli t20 captaincy record)కు గుడ్​బై చెప్పబోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్​కు గురిచేశాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. పనిభారాన్ని తగ్గించుకునేందుకే ఈ విధంగా చేసినట్లు వెల్లడించాడు. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కోహ్లీ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొందరు ఐపీఎల్​ కెప్టెన్సీపై ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ టీ20ల కన్నా ఐపీఎల్ సారథ్యం(virat kohli ipl captaincy record) వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుందని గుర్తు చేస్తున్నారు. దీనిపై ఓ బీసీసీఐ అధికారి మాట్లాడారు.

"విరాట్ కోహ్లీ(virat kohli news) నుంచి వచ్చిన ప్రకటన ఎలాంటిదో అర్థం కావడం లేదు. ఈ నిర్ణయం వల్ల పనిభారం తగ్గిందని అనుకుంటున్నాడా? కరోనా కారణంగా డిసెంబర్ 2020 నుంచి ఇప్పటివరకు టీమ్ఇండియా 8 టీ20లు మాత్రమే ఆడింది. వీటికంటే ఐపీఎల్​ మ్యాచ్​(ipl match)లే ఎక్కువగా జరిగి ఉండొచ్చు. ఐపీఎల్​ కెప్టెన్సీ కూడా చిన్న విషయమేమీ కాదు. టోర్నీని క్షుణ్ణంగా గమనిస్తే అది మీకే అర్థమవుతుంది. మ్యాచ్​లు, టైటిల్​ గెలవాలన్న ఫ్రాంచైజీల ఒత్తిడి కూడా విపరీతంగా ఉంటుంది. మరి ఆర్సీబీ కెప్టెన్సీ(virat kohli rcb captain)ని కూడా కోహ్లీ వదిలేస్తాడా? మూడు ఫార్మాట్ల (వన్డే, టెస్టు, ఐపీఎల్)కూ ఇంకా అతడు సారథ్యం వహిస్తున్నందున ఇప్పటికీ పని భారం తగ్గలేదనే భావిస్తున్నా."

-ఓ బీసీసీఐ అధికారి

ఆర్సీబీకి కెప్టెన్​గా..

ఆర్సీబీకి కెప్టెన్​గా కోహ్లీ(virat kohli rcb captain)కి చెత్త రికార్డే ఉంది. 2013లో ఈ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న విరాట్.. ఇప్పటివరకు జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు. జట్టును ఒక్కసారి మాత్రమే ఫైనల్​కు చేర్చగలిగాడు. 2016 తర్వాత మళ్లీ గత సీజన్​లో ప్లే ఆఫ్స్ వరకూ చేరుకోగలిగినా ఫైనల్​కు మాత్రం చేరుకోలేకపోయింది. 2017, 19లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 2018లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

ఆర్సీబీ కెప్టెన్సీకీ గుడ్​బై!

ఐపీఎల్ 14వ సీజన్​ (ipl 2021 schedule) మొదటి దశలో మంచి ప్రదర్శన కనబర్చింది ఆర్సీబీ. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో మూడో స్థానంలో ఉంది కోహ్లీసేన. మిగతా ఏడు మ్యాచ్‌ల్లో రెండింట్లో నెగ్గినా ప్లేఆఫ్‌ చేరొచ్చు. దీంతో ఈసారైనా ఫ్రాంచైజీ టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకేవేళ ఈ సీజన్​లోనూ ఆర్సీబీ ఫైనల్​కు చేరడంలో విఫలమైతే.. ఐపీఎల్ కెప్టెన్సీ(virat kohli rcb captain)కి కోహ్లీ గుడ్​బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఇవీ చూడండి: స్టార్ క్రికెటర్లను దాటేసిన నీరజ్ చోప్డా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.