ETV Bharat / sports

ఈ వికెట్​కీపర్లు కెప్టెన్లుగానూ అదుర్స్​.. స్కెచ్​ వేశారంటే..

author img

By

Published : Jun 10, 2022, 7:30 PM IST

క్రికెట్​లో వికెట్​ కీపర్లకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా సందర్భాల్లో తమ వికెట్​ కీపింగ్​ నైపుణ్యంతో మ్యాచ్​లను ములుపు తిప్పారు. అలాంటి ఆటగాళ్లలో కొందరు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చెప్పట్టి జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందామా..

ధోని
ధోనీ

ఏ ఆటలోనైనా కెప్టెన్‌కు ఉండే ప్రాధాన్యతే వేరు. అది క్రికెట్‌లో మరింత ఎక్కువే. మైదానంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఫీల్డర్లను ఎక్కడ పెట్టాలన్నా.. బంతిని ఎవరికి ఇవ్వాలన్నా.. అన్ని నిర్ణయాలు అతడే తీసుకోవాలి. అదే వికెట్‌ కీపరే కెప్టెన్‌గా మారితే, ఆ పని ఇంకా సులువవుతుంది. వికెట్ల వెనుక నిలబడి.. స్టేడియం నలువైపులా ఏం జరుగుతుందో గమనించగలడు. దీంతో అవసరమైన నిర్ణయాలు తీసుకొని జట్టు విజయాలకు కృషి చేస్తాడు. అలా అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్‌ కీపింగ్‌తో పాటు కెప్టెన్సీ చేసి మంచి గుర్తింపు సాధించిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం..

ధోనీ ది నంబర్‌ వన్‌..: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్‌ చరిత్రలోనే అతిగొప్ప వికెట్‌ కీపర్‌ కెప్టెన్‌. భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించి ప్రపంచ క్రికెట్‌లో మరెవరికీ సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 331 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అతడు 178 విజయాలు సాధించాడు. అలాగే కీపర్‌గా 500లకు పైగా క్యాచ్‌లు, 150కిపైగా స్టంపింగ్‌లు చేసి.. వికెట్‌ కీపర్‌ కెప్టెన్‌కు ఘనమైన రికార్డులు సొంతం చేసుకున్నాడు.

.

సంగక్కర ది గ్రేట్‌..: శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర కూడా ఆ జట్టుకు వికెట్ కీపర్‌, కెప్టెన్‌గా అత్యుత్తమ సేవలు అందించాడు. కీపింగ్‌లో రాణిస్తూనే కెప్టెన్‌గా 82 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అందులో సుమారు 60 శాతం మేర విజయాలు సాధించాడు. 2009 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో శ్రీలంకను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అయితే, ఆ రెండు ఫైనల్స్‌లో జట్టు ఓటమిపాలైంది. ఇక టెస్టుల్లో, వన్డేల్లో పది వేల పరుగులు పూర్తిచేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా చరిత్రలో నిలిచాడు. కీపర్‌గా 600కు పైగా క్యాచ్‌లు, 100కు పైగా స్టంపింగ్స్‌ చేశాడు.

.

గిల్‌క్రిస్ట్‌ ది బెస్ట్‌..: ఆస్ట్రేలియా క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌ చెరగని ముద్ర వేశాడు. ఈ మాజీ ఛాంపియన్‌ కెప్టెన్‌గానూ ఆ జట్టుకు సేవలందించాడు. అయితే, అతడు చాలా కొద్ది మ్యాచ్‌లకే నాయకత్వం వహించడం గమనార్హం. 6 టెస్టులు, 17 వన్డేలు, 2 టీ20లకు కెప్టెన్సీ చేసిన గిల్లీ.. 62 శాతం విజయాలు నమోదు చేశాడు. అయితే, ఆస్ట్రేలియా టీమ్‌లో గొప్ప సారథులుగా పేరొందిన స్టీవ్ వా, రికీపాంటింగ్‌లకు చాలాకాలం వైస్‌ కెప్టెన్‌గా సేవలందించాడు.

.

ముష్‌ఫికర్‌ ది సెన్సేషన్‌..: బంగ్లాదేశ్‌ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు ముష్‌ఫికర్‌ రహీమ్‌. అతడెంతో కాలంగా వికెట్‌ కీపర్‌గా కొనసాగుతున్నా కెప్టెన్‌గానూ ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు సారథిగా నిలిచాడు. మొత్తం 90 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన ముష్‌ఫికర్‌ ఆ జట్టుకు పలు సంచలన విజయాలు అందించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి బలమైన జట్లకు షాకివ్వగా.. విదేశాల్లో శ్రీలంకపై విజయం సాధించాడు. ఇక కీపర్‌గానూ అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో 100కు పైగా స్టంపింగ్స్‌, క్యాచ్‌ ఔట్‌లు చేశాడు.

.

బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ది స్పెషల్‌..: న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ సైతం వికెట్ కీపర్‌, కెప్టెన్‌గా రాణించాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉంటూనే సారథిగా ఆకట్టుకున్నాడు. అతడు మొత్తం 121 మ్యాచ్‌లకు (62 వన్డేలు, 31 టెస్టులు, 28 టీ20లు) కెప్టెన్సీ చేసి సగానికి పైగా మ్యాచ్‌లు గెలిపించాడు. దీంతో న్యూజిలాండ్‌ తరఫున అత్యుత్తమ వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌గా నిలిచాడు. అలాగే వికెట్‌ కీపర్‌గానూ ఆకట్టుకున్నాడు. వికెట్ల వెనుక మెక్‌కల్లమ్‌ కీపర్‌గా 150కిపైగా వికెట్లు తీయడంలో పాలుపంచుకున్నాడు. అలాగే కివీస్‌ను 2015 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌ వరకూ తీసుకెళ్లాడు.

.

ఇదీ చూడండి : తీవ్ర విషాదం.. రింగ్‌లోనే కుప్పకూలి బాక్సర్​ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.