WI vs ENG: ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో విండీస్ జట్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 710 నిమిషాల మారథాన్ ఇన్నింగ్స్ ఆడి అరుదైన ఘనతను సాధించాడు. క్రీజులో ఎక్కువ సేపు గడిపిన టాప్ 5 వెస్టిండీస్ ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
ఈ మ్యాచ్‌లో ఏకంగా 12 గంటలకు పైగా క్రీజులో నిలిచాడు బ్రాత్ వైట్. 489 బంతులు ఆడి 17 ఫోర్లతో 160 పరుగులు చేశాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో విండీస్ దిగ్గజాలు బ్రియాన్ లారా, శర్వాన్, వోరెల్ సరసన చేరాడు.
లారా తర్వాత బ్రాత్‌వైట్..
క్రీజులో ఎక్కువ సేపు గడిపిన విండీస్ ఆటగాళ్ల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ఉన్నాడు. 2004లో ఇంగ్లాండ్‌పై సుదీర్ఘంగా 778 నిమిషాల ఇన్నింగ్స్‌ను ఆడి లారా రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో లారా 582 బంతుల్లో 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 1996లో ఇంగ్లాండ్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 766 నిమిషాల పాటు క్రీజులో కొనసాగాడు. 2009లో విండీస్ ఆటగాడు శర్వాన్ 698 నిమిషాలు క్రీజులో ఉండి నాలుగో స్థానంలో, 1960లో వోరెల్ 682 నిమిషాలు ఆడి ఐదో స్థానంలో నిలిచారు.