ETV Bharat / sports

వన్డే వరల్డ్ కప్‌లో అతడు లేకుంటే కష్టమే.. భారత్​కు ఆ బ్యాటర్​ చాలా ఇంపార్టెంట్!

న్యూజిలాండ్​తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ తరఫున అద్భుతంగా రాణిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. తొలి వన్డేలో బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిపోకుండా అడ్డుకున్నాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో తిరుగులేకుండా ఆడుతున్నాడు. అందుకే వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్​ ఉన్న నేపథ్యంలో టీమ్​ఇండియాలో శ్రేయస్ స్థానం కీలకమనే చెప్పొచ్చు. అతడు జట్టులో ఎందుకు కీలకమో ఒకసారి పరిశీలిస్తే..

Shreyas Iyer
Shreyas Iyer
author img

By

Published : Nov 28, 2022, 10:16 AM IST

ODI World Cup Shreyas Iyer: కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ తరఫున అద్భుతంగా రాణిస్తున్న బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ ఒకడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తొలి వన్డేలో బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిపోకుండా అడ్డుకున్నాడు. సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్‌లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో అద్భుతంగా సత్తా చాటుతున్న అతడు.. జట్టులో ఎందుకు కీలకమో ఒకసారి పరిశీలిస్తే..

ఫామ్‌లో ఉన్న ప్లేయర్
ఈ ఏడాది శ్రేయస్ అయ్యర్.. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో తిరుగులేకుండా ఆడుతున్నాడు. కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇంత అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతడు జట్టుకు చాలా కీలకంగా మారతాడు. 2021లో జట్టులోకి వచ్చి గాయం కారణంగా మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. తిరిగొచ్చేసరికి పంత్, సూర్యకుమార్ వంటి ఆటగాళ్లతో తన స్థానం కోసం పోటీ పడాల్సి వచ్చింది. ఈ పోటీని తట్టుకొని వన్డే ఫార్మాట్‌లో తానే బెటర్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. ఈ ఏడాది ఆడిన 11 వన్డే మ్యాచుల్లో 63 సగటుతో 566 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉండటం గమనార్హం.

స్పిన్‌ను దంచికొడతాడు
శ్రేయస్ అయ్యర్ తరఫున వినిపించే బలమైన వాదనల్లో ఇది ఒకటి. అతడు స్పిన్ బౌలింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొంటాడు. స్పిన్ బౌలింగ్‌లోనే అతను 520 పరుగులు చేయడం గమనార్హం. స్పిన్‌ బౌలింగ్‌లో అయ్యర్ స్ట్రైక్ రేట్ 105, సగటు 87 అంటేనే ఈ బౌలర్లపై అతడి ఆధిపత్యం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌నకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అయ్యర్ సత్తా జట్టుకు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది.

ఇన్నింగ్స్ నిర్మించగలడు
ఏదో క్రీజులోకి వచ్చామా? మన వంతుగా కొన్ని పరుగులు చేసి వెళ్లిపోయామా? అన్నట్లుగా కాకుండా పరిస్థితికి తగినట్లు ఇన్నింగ్స్ నిర్మించగలిగే సత్తా కూడా అయ్యర్‌కు ఉంది. ఈ ఏడాది అక్టోబరులో లఖ్​నవూ వేదికగా కివీస్‌తో జరిగిన వన్డేలో అతని ఆలోచనా విధానం తేటతెల్లమైంది. ఆ మ్యాచ్‌లో టపటపా మూడు వికెట్లు కోల్పోయిన టీమ్​ఇండియా కష్టాల్లో ఉంది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్.. ధనాధన్ బ్యాటింగ్‌తో 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇలా పరిస్థితికి తగినట్లు బ్యాటింగ్ చేస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లే సత్తా అయ్యర్ సొంతం. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌కు అతడి ఆటతీరు చాలా కరెక్ట్‌గా సరిపోతుందని చెప్పొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.