ETV Bharat / sports

ఆ స్టార్​ క్రికెటర్​పై నాలుగేళ్ల పాటు బ్యాన్‌ - క్రికెటర్​పై నిషేధం

వెస్టిండీస్‌ బ్యాటర్ జాన్ క్యాంప్‌బెల్‌పై నాలుగేళ్లపాటు నిషేధం విధించింది జమైకా యాంటీ డోపింగ్‌. ఈ విషయాన్ని తెలియజేస్తూ 18 పేజీల ప్రకటనను కమిషన్‌ విడుదల చేసింది.

west indies batter doping ban
ఆ స్టార్​ క్రికెటర్​పై నాలుగేళ్ల పాటు బ్యాన్‌
author img

By

Published : Oct 8, 2022, 8:25 PM IST

వెస్టిండీస్‌ బ్యాటర్ జాన్ క్యాంప్‌బెల్‌పై నాలుగేళ్లపాటు నిషేధం పడింది. యాంటీ డోపింగ్‌ నిబంధనల ప్రకారం.. శాంపిల్స్‌ను ఇచ్చేందుకు క్యాంప్‌బెల్‌ నిరాకరించాడని జమైకా యాంటీ డోపింగ్‌ (జాడ్కో) త్రి సభ్య కమిషన్‌ ప్యానెల్‌ ఈ నిర్ణయం తీసుకొంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ 18 పేజీల ప్రకటనను కమిషన్‌ విడుదల చేసింది. గత ఏప్రిల్‌లో రక్త నమూనాలను ఇచ్చేందుకు కింగ్‌స్టన్‌లోని తన నివాసంలో క్యాంప్‌బెల్‌ నిరాకరించాడనే ఆరోపణలను కమిటీ నిర్థారించింది. అందుకే క్యాంప్‌బెల్‌ యాంటీ డోపింగ్‌ నిబంధనలను అతిక్రమించడంతో జాడ్కో రూల్‌ 2.3 ప్రకారం నిషేధం విధించింది.

'జాడ్కో రూల్ 2.3 ప్రకారం సదరు అథ్లెట్‌ డోపింగ్‌ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్యానెల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక స్పష్టం చేసింది. క్యాంప్‌బెల్‌ యాంటీ డోపింగ్‌ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని నిరూపించుకోలేకపోయాడు. దీంతో అతడిపై నాలుగేళ్లపాటు నిషేధం విధించడం జరిగింది" అని కమిటీ వెల్లడించింది.

కింగ్‌స్టన్‌లో జన్మించిన క్యాంప్‌బెల్‌ 2019లో విండీస్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. గత జులైలోనే బంగ్లాదేశ్‌తో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. 29 ఏళ్ల క్యాంప్‌బెల్‌ ఇప్పటి వరకు 20 టెస్టులు, ఆరు వన్డేలు, కేవలం రెండు టీ20లను ఆడాడు.

ఇదీ చూడండి: అదరగొట్టిన అమ్మాయిలు.. బంగ్లాదేశ్​పై ఘన విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.