జెంటిల్మన్ గేమ్‌గా పిలుచుకునే క్రికెట్లో తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ, ఉద్దేశపూర్వకంగా మైదానంలో నియంత్రణ కోల్పోయి ప్రవర్తించడం చాలా అరుదు. శుక్రవారం ఢాకా టీ20 లీగ్‌లో షకిబుల్ హసన్ ఇలాగే వ్యవహరించాడు. ఒకసారి కాదు రెండుసార్లు కాస్త అతి చేశాడు. ఈ దృశ్యాలు చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
అసలేం జరిగింది?
లీగ్‌లో భాగంగా మహమ్మదీయన్ స్పోర్టింగ్ క్లబ్(ఎంఎస్సీ), అబహానీ లిమిటెడ్(ఏఎల్) మధ్య మ్యాచ్ జరిగింది. ఎంఎస్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న షకిబుల్.. ఏఎల్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్‌కు బంతి వేశాడు. ఎల్బీ కోసం అంపైర్‌కు అప్పీల్ చేయగా.. అతడు నాటౌట్‌గా ప్రకటించాడు. అంతే ఆగ్రహానికి లోనైన హసన్.. వికెట్లను కాళ్లతో తన్నాడు.
-
Look At Shakib Rude Behavior In Dhaka T20 League.🤢 pic.twitter.com/5itTtNT9kp
— #SHEKHAWAT👑 (@Shekhaw75103702) June 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Look At Shakib Rude Behavior In Dhaka T20 League.🤢 pic.twitter.com/5itTtNT9kp
— #SHEKHAWAT👑 (@Shekhaw75103702) June 11, 2021Look At Shakib Rude Behavior In Dhaka T20 League.🤢 pic.twitter.com/5itTtNT9kp
— #SHEKHAWAT👑 (@Shekhaw75103702) June 11, 2021
మరికొద్దిసేపటికి పవర్‌ప్లే ఓవర్ల సందర్భంగా మరోసారి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు షకిబుల్. ఈ సారి నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మూడు వికెట్లను చేతులతో తీసి గ్రౌండ్‌పై కొట్టాడు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఐపీఎల్ సందర్భంగా షకిబుల్‌పై ఐసీసీ విధించిన నిషేధం ఇటీవలే ముగిసింది.
-
One more... Shakib completely lost his cool. Twice in a single game. #DhakaLeague Such a shame! Words fell short to describe these... Chih... pic.twitter.com/iUDxbDHcXZ
— Saif Hasnat (@saifhasnat) June 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">One more... Shakib completely lost his cool. Twice in a single game. #DhakaLeague Such a shame! Words fell short to describe these... Chih... pic.twitter.com/iUDxbDHcXZ
— Saif Hasnat (@saifhasnat) June 11, 2021One more... Shakib completely lost his cool. Twice in a single game. #DhakaLeague Such a shame! Words fell short to describe these... Chih... pic.twitter.com/iUDxbDHcXZ
— Saif Hasnat (@saifhasnat) June 11, 2021
ఇదీ చదవండి: బంగ్లా క్రికెటర్ షకిబుల్‌పై ఐసీసీ నిషేధం..!
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఎస్సీ టీమ్.. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. షకిబుల్ 27 బంతుల్లోనే 37 రన్స్ చేసి తమ జట్టుకు పోరాడే స్కోరును అందించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏఎల్ జట్టు 9 ఓవర్లలో 6 వికెట్లకు 44 రన్స్ చేసింది. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో మహమ్మదీయన్ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.
నన్ను క్షమించండి..
ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరాడు షకిబుల్. "ఓ సీనియర్ ఆటగాడిగా నేనిలా చేయాల్సింది కాదు. కానీ, కొన్ని సార్లు దురదృష్టవశాత్తూ ఇలా జరుగుతుంటాయి. ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ క్షమాపణలు కోరుతున్నా. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావని మీకు మాట ఇస్తున్నా. అందరికీ ధన్యవాదాలు" అని షకిబ్ పేర్కొన్నాడు.
-
Shakib Al Hasan has apologized to all the cricket fans for kicking the stumps after a call from the umpire and uprooting the stumps when the umpire decided to stop the stopped play when rain came. pic.twitter.com/0EyAXSkGQ8
— Johns. (@CricCrazyJohns) June 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Shakib Al Hasan has apologized to all the cricket fans for kicking the stumps after a call from the umpire and uprooting the stumps when the umpire decided to stop the stopped play when rain came. pic.twitter.com/0EyAXSkGQ8
— Johns. (@CricCrazyJohns) June 11, 2021Shakib Al Hasan has apologized to all the cricket fans for kicking the stumps after a call from the umpire and uprooting the stumps when the umpire decided to stop the stopped play when rain came. pic.twitter.com/0EyAXSkGQ8
— Johns. (@CricCrazyJohns) June 11, 2021
ఇదీ చదవండి: 'కుల్దీప్పై బోర్డుది సవతి తల్లి ప్రేమ'