ETV Bharat / sports

వాషింగ్టన్ ఔట్.. టీమ్​ఇండియా వన్డే జట్టులోకి ఆ ఇద్దరు - నవదీప్ సైని న్యూస్ టుడే

Washington Sundar Replacement: కొవిడ్​ సోకిన నేపథ్యంలో టీమ్​ఇండియా ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్​ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు దూరమయ్యాడు. మరోవైపు ప్రొటీస్​ జట్టుతో జరిగిన రెండో టెస్టులో సిరాజ్ గాయపడ్డాడు. దీంతో వారి స్థానాల్లో జయంత్​ యాదవ్​, నవదీప్​ సైనీకి చోటు కల్పించింది సెలక్షన్​ కమిటీ.

jayant, saini
జయంత్ యాదవ్, నవదీప్ సైని
author img

By

Published : Jan 12, 2022, 7:45 PM IST

Washington Sundar Replacement: కొవిడ్​ కారణంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్​కు దూరమయ్యాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండగా అతడికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో జట్టుకు దూరమైన వాషింగ్టన్ స్థానంలో జయంత్ యాదవ్​ను ఎంపిక చేసింది సీనియర్ సెలక్షన్ కమిటీ.

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్​లో భాగంగా రెండో మ్యాచ్​లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్​ గాయపడ్డాడు. దీంతో వన్డే సిరీస్​లో అతడికి బ్యాకప్​గా యువ ఆటగాడు నవదీప్​ సైనీని ఎంపిక చేసింది సెలక్షన్ ప్యానెల్.

జనవరి 19 నుంచి టీమ్​ఇండియా​, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​ ప్రారంభంకానుంది.

టీమ్​ఇండియా వన్డే జట్టు..

కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవదీప్ సైని.

ఇదీ చదవండి:

'కంగారూల గడ్డపై టెస్టు సిరీస్ విజయం.. ఓ సువర్ణాధ్యాయం'

కీగన్ పీటర్సన్ హాఫ్​ సెంచరీ.. దక్షిణాఫ్రికా 176/7

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.