Warner daughter playing cricket: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ వార్నర్ రెండో కూతురు ఇండిరే చాలా మంది క్రికెట్ అభిమానులకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్నారి గతంలో చాలా సార్లు బ్యాటింగ్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా ఈమెకు సంబంధించిన మరో బ్యాటింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో ఇండిరే ఓ బంతిని లెగ్‌సైడ్ దిశగా భారీ షాట్ ఆడింది. అది కాస్త బౌండరీని తాకింది. ఈ వీడియోను వార్నర్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. 'ఎంసీజీ మైదానంలో ఇండి ఫస్ట్ షాట్ కొట్టింది' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చాడు. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
-
Indi having her first hit at the MCG 👌👌 pic.twitter.com/fb9eqd85u0
— David Warner (@davidwarner31) December 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Indi having her first hit at the MCG 👌👌 pic.twitter.com/fb9eqd85u0
— David Warner (@davidwarner31) December 28, 2021Indi having her first hit at the MCG 👌👌 pic.twitter.com/fb9eqd85u0
— David Warner (@davidwarner31) December 28, 2021
కాగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా మూడో టెస్టు మెల్బోర్న్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌కు వార్నర్ కుటుంబం కూడా హాజరైంది. ఈ మ్యచ్ గెలిచిన అనంతరం వార్నర్ అధికారుల అనుమతితో తన కూతురు ఇండిరేతో కలిసి మైదానంలో క్రికెట్ ఆడాడు. అప్పుడే ఇండిరే భారీ షాట్ ఆడి క్రికెట్ ప్రియుల్ని ఆకట్టుకుంది.
వార్నర్ కుటుంబానికి భారత దేశమంటే చాలా ఇష్టం. అలాగే ఇక్కడి సంప్రదాయాలన్నా ఎంతో గౌరవం. అందుకే తమ రెండో కూతురికి ఇండిరే అనే పేరుపెట్టారు. అలాగే ఆ చిన్నారి.. టీమ్ఇండియా టెస్టు సారథి కోహ్లీకి విరాభిమాని అని, పెద్దయ్యాక అతడిలా అవ్వాలని అనుకుంటోందని గతంలో ఓ ఇంటర్వ్యూలో వార్నర్ భార్య చెప్పింది. కాగా, లాక్‌డౌన్ సమయంలో వార్నర్ కుటుంబం మొత్తం పలు భారతీయ సినిమా పాటలు, డైలాగులకు టిక్‌టాక్ వీడియోలు చేసింది. అవి కూడా వారికి పత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ఇదీ చూడండి: 'భారత్‌ను వారి గడ్డపైనే ఓడించాలి.. అదే నా కోరిక'