ETV Bharat / sports

'మనీష్​ను తీసుకోకపోవడం కఠిన నిర్ణయం' - వార్నర్​ సెలక్టర్లు

దిల్లీతో జరిగిన మ్యాచ్​లో మనీష్​ పాండేను సెలక్టర్లు పక్కనపెట్టడం తన దృష్టిలో కఠిన నిర్ణయమని అన్నాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ సారథి వార్నర్​. అతడి స్థానంలో తీసుకున్న విరాట్​సింగ్​ మంచి ఆటగాడని ప్రశంసించాడు.

Warner
వార్నర్​
author img

By

Published : Apr 26, 2021, 12:41 PM IST

ఈ ఐపీఎల్​లో నిలకడగ రాణిస్తున్న మనీష్​ పాండేను ఆదివారం దిల్లీతో జరిగిన మ్యాచ్​లో పక్కనపెట్టి అతడి స్థానంలో విరాట్​ సింగ్​ను తీసుకున్నారు. దీనిపై స్పందించిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ సారథి డేవిడ్​ వార్నర్​.. సెలక్టర్లను పరోక్షంగా విమర్శించాడు. అతడిని తీసుకోకపోవడం తన దృష్టిలో కఠిన నిర్ణయమని చెప్పాడు.

"ఎవరిని తీసుకోవాలనేది సెలక్టరపై ఆధారపడి ఉంటుంది. కానీ మనీష్​ను పక్కనపెట్టడం నా దృష్టిలో కఠినమైన నిర్ణయం. అలాగని విరాట్​ను తీసిపారేయలేం. అతడు కూడా మంచి ఆటగాడు. కానీ పిచ్​ కొంచెం కఠినంగా ఉంది. ఇక దిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్​ చేశారు. వారిని మేము సవాల్​గా ఎదుర్కొన్నాం" అని అన్నాడు.

చెపాక్ వేదికగా జరిగిన దిల్లీ- హైదరాబాద్ మ్యాచ్ సూపర్ ఓవర్​కు దారి తీసింది. ఈ ఓవర్​లో మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 7 పరుగులే చేయగా అనంతరం దిల్లీ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో ఇదే తొలి సూపర్‌ ఓవర్‌ కావడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.