Virat Rahul Partnership : 2023 ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. చెన్నై చెపాక్ వేదికగా ఆస్టేలియాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే 200 పరుగుల ఛేదనలో టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ సహా.. మూడు కీలక వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో జతకట్టాడు. వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించిన తీరు అమోఘం. అయితే వీరి ఇన్నింగ్స్ నేటి తరం యువ క్రికెటర్లకు స్ఫూర్తి నింపేలా ఉందంటూ పలువురు క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
ఆదివారం ఆసీస్‌పై టీమ్ఇండియా బ్యాటర్లు కోహ్లి, రాహుల్.. ప్రస్తుత యువ బ్యాటర్లకు పాఠంలా బోధించే ఇన్నింగ్స్ ఆడారు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన రాహుల్.. ఎంతో ఓపిగ్గా స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఇక ఛేదనలో రారాజుగా పేరున్న విరాట్ కూడా ఎక్కడా ఓపిక కోల్పోలేదు. జట్టును విజయతీరాలకు చేర్చడమే లక్ష్యంగా.. ఆడిన వీరి ఇన్నింగ్స్ భారత క్రికెట్లో చిరస్మరణీయం. స్కోర్ బోర్డులో వంద పరుగులు చేరినప్పటికీ.. వీరు ఎక్కడా ఆసీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. నాలుగో వికెట్‌కు ఈ జోడీ 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. జట్టును 2/3 పరిస్థితి నుంచి.. 167/4కు దాదాపు విజయతీరాలకు తీసుకొచ్చి కోహ్లీ (85) ఔటయ్యాడు. తర్వాత రాహుల్ (97).. హార్దిక్‌తో కలిసి మిలిగిన పని పూర్తిచేశాడు. ఇంతటి విలువైన ఈ ఇన్నింగ్స్.. యంగ్ క్రికెటర్లకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే!
టెస్ట్ మ్యాచ్‌లా అడమన్నాడు.. క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రాహుల్, విరాట్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే రాహుల్ బ్యాటింగ్‌కు రాగానే.. అతడికి కొంతసేపు టెస్టు ఇన్నింగ్స్‌లా నెమ్మదిగా ఆడాలని విరాట్ చెప్పాడంట.
"ఛేజింగ్‌లో ఎవరూ అటువంటి ప్రారంభం ఆశించరు. ఆరంభంలో కొంత ఒత్తిడికి గురయ్యా. ఆసీస్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మేము పేలవ షాట్లు ఎంపికచేసుకున్నాం. పవర్ ప్లేలో వేగంగా ఆడే క్రమంలో అలా జరగడం మామూలే. క్లిష్ట పరిస్థితుల్లో గొప్పగా ఆడిన విరాట్, రాహుల్‌కు హ్యాట్సాఫ్ " అని మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
-
A match-winning partnership followed by a warm hug 🤗
— BCCI (@BCCI) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Well played, KL Rahul & Virat Kohli 👏#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/aVdbkVHekz
">A match-winning partnership followed by a warm hug 🤗
— BCCI (@BCCI) October 8, 2023
Well played, KL Rahul & Virat Kohli 👏#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/aVdbkVHekzA match-winning partnership followed by a warm hug 🤗
— BCCI (@BCCI) October 8, 2023
Well played, KL Rahul & Virat Kohli 👏#CWC23 | #INDvAUS | #TeamIndia | #MeninBlue pic.twitter.com/aVdbkVHekz
Ind vs Aus World Cup 2023 : కోహ్లీ-కేఎల్ రాహుల్ సూపర్ షో.. ప్రపంచకప్‌లో టీమ్ఇండియా శుభారంభం
ODI World Cup 2023 : రోహిత్ స్పెషల్ రికార్డ్ - బతికిపోయిన కోహ్లీ!