టాస్.. ఒక మ్యాచ్‌లో ఏ జట్టు ముందు బ్యాటింగ్‌కు రావాలి.. ఏ జట్టు ఫీల్డింగ్‌కు రావాలో నిర్దేశించేది మాత్రమే. కానీ, ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం టాసే కీలకంగా మారింది. ముఖ్యంగా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం.. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఓటమి చవిచూడడం జరుగుతోంది. సూపర్- 12లో భాగంగా జరిగిన చాలా వరకు మ్యాచుల్లో టాస్ గెలుపొందిన జట్లకు టాస్ ఫేవర్ చేసిందనడంలో సందేహం అవసరం లేదు.
ఇక భారత్ విషయానికొస్తే ఈ టోర్నీలో పాక్, న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఈ రెండు మ్యాచుల్లోనూ భారత్(virat kohli toss record) టాస్ ఓడిపోవడం గమనార్హం. ఈ రెండుసార్లూ భారతే తొలుత బ్యాటింగ్ చేసింది. ఫలితం మాట అటుంచితే టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి(Virat Kohli toss loss) మాత్రం టాస్ ఎప్పుడూ కలిసి రాలేదన్నది జగమెరిగిన సత్యం. బుధవారం జరిగిన అఫ్గాన్‌తో మ్యాచ్‌లో కూడా కోహ్లీ టాస్ ఓడిపోవడం వల్ల టాస్‌పై సోషల్‌మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. 'విరాట్ భయ్యా.. టాస్ ఎప్పుడు గెలుస్తావు?' అంటూ నెెటిజన్లు ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు.
గాల్లోకి ఎగిరే కాయిన్ కారణంగా కోహ్లీని ఇక్కడ నిందించాల్సిన అవసరం లేదు. అయితే, టాస్ గెలిచే విషయంలో 50/50 అవకాశాలుంటాయన్నది విశ్లేషకుల మాట. ఈ విషయంలో విరాట్ కొంచెం వెనుకంజలో ఉన్నాడనే చెప్పాలి. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మూడు మ్యాచుల్లోనూ విరాట్ టాస్ ఓడిపోవడమే ఇందుకు ఉదాహరణ.
టాస్ చెత్త రికార్డు
ఇదొక్కటే కాదు.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచుల్లో 12 సార్లు టాస్ వేస్తే 10 సార్లు విరాట్ టాస్ ఓడిపోయాడు. ఇప్పటి వరకు 63 టెస్టుల్లో 27 సార్లు మాత్రమే కోహ్లీ టాస్ గెలిచాడు. గెలుపోటముల నిష్పత్తి 0.75 అన్నమాట. వన్డేల విషయానికొస్తే 95 సార్లు టాస్ వేస్తే గెలిచింది 40 మాత్రమే. గెలుపోటముల నిష్పత్తి 0.72. టీమ్ ఇండియా కెప్టెన్లతో పోల్చినప్పుడు ఈ విషయంలో విరాటే చివరి స్థానంలో ఉన్నాడు. అజారుద్దీన్, కపిల్ దేవ్ విషయంలో మాత్రమే గెలుపోటముల నిష్పత్తి 1 కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇంతకుముందు టీమ్ ఇండియాకు సారథ్యం వహించిన ధోనీ (0.91), గంగూలీ (0.95) కూడా టాస్ విషయంలో విరాట్ కంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. అయినా ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎన్నో సార్లు జట్టును విజయతీరాలకు చేర్చిన కోహ్లీకి మాత్రం టాస్ కలిసి రావడం లేదెందుకో??
ఇదీ చదవండి: